జగన్ దెబ్బ.. అట్లుంటది మరి!

జగన్ దెబ్బ.. అట్లుంటది మరి!

అవును.. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క.. అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా!. Sootiga.in ఈ స్పెషల్ స్టోరీ చూశాక మీకే అసలు సేన్ అర్థం అవుతుంది.. ఇక ఎందుకు ఆలస్యం చదివేయండి!

బాబోయ్.. వద్దు!

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.. దేశంలోనే నేనే సీనియర్ నాయకుడిని.. ఎంతో మందిని ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు.. ప్రధాన మంత్రులు చేశా..! ఇక సూది గుండి నుంచి సెల్ ఫోన్ దాకా.. హైదరాబాద్ మొదలుకుని ఐటీ దాకా.. అన్నీ నేనే.. నేను కనిపెట్టనిది.. కనిపెట్టలేనిది ఏదీ లేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వం నేనే.. సర్వాంతర్యామి..! నేను లేకుంటే ఒక్కోసారి ఈ భూ ప్రపంచం ఏమవుద్దా అని ధర్మ సందేహం.. అని టీడీపీ అధినేత చంద్రబాబు మనసులోని.. కొన్ని బయటికి వచ్చిన మాటలు.!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్.. అసలేంటీ ప్రోగ్రాం..? స్కాం ఎలా జరిగింది?

అవును నేనే!

ఇక అసలు విషయానికి వస్తే..నేను నిప్పు.. నన్ను టచ్ చేసేవాళ్ళు లేరు.. టచ్ చేసినా ఏమైందో అందరికీ తెలుసు.. పెద్ద పెద్దోళ్ల వల్లే కాలేదు.. కాదు.. కాదు ఏమీ పీకలేకపోయారు.. నువ్వెంత.. నువ్వేంటి.. నీ కథేంటి?.. నా మీద ఎన్ని కేసులు పెట్టారు.. నన్ను ఇబ్బంది పెట్టాలని ఎన్నెన్నో కలలు కన్నారు. ఒక్కడు ఒక్కటంటే ఒక్కడు కూడా ఏం చేయలేకపోయారు.. ఇవీ నిత్యం చంద్రబాబు ఎంటో పవిత్రంగా మాట్లాడే మాటలు. సీన్ కట్ చేస్తే శుక్రవారం నుంచి ఆదివారం ఆర్ధరాత్రి వరకు జరిగిన సినిమా అందరూ టీవీల్లో చూసే ఉంటారు..ఇక ప్రత్యేకంగా చెప్ప్పడనికి ఏముంది.

ఇప్పటి వరకు..ఇప్పుడు!

చంద్రబాబుపై ఇప్పటి వరకు లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఐతే వాటిలో కొన్ని ఆరోపణలుగానే మిగిలిపోయాయి.. ఇంకొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు.. ఇది జగమెరిగిన సత్యమే. ఐతే ఇప్పుడు రోజులు మారాయ్.. ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క.! వైఎస్ జగన్ రెడ్డి అద్వర్యంలోని ఏపీ ప్రభుత్వం దెబ్బకు ఒక్కసారి సీన్ రివర్స్ అయ్యింది. అసలు బాబు మీద ఉన్న కేసులు ఎన్ని..? ఎవరెవరు ఏమేం ఆరోపించారు..? ఫైనల్ గా జరిగింది..? అనే విషయాలు చూద్దామా..!

జగన్ దెబ్బ.. అట్లుంటది మరి!

తొలిసారి..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. నాడు వైఎస్ కూడా చంద్రబాబును జైలుకు పంపించేందుకు శతవిధాలుగా యత్నించారు. కానీ ఏనాడు అవలేదు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలిసారిగా జ్యుడిషియల్ రిమాండ్‌కు వెళ్లారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేసిన చంద్రబాబు 1978లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 1981లో ఆయన మంత్రి అయ్యారు.

నో కేస్!

ఆ తరువాత 14 ఏళ్లకు అంటే 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగానూ.. 14 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు 14 రోజుల పాటు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బేగంపేట విమానాశ్రయం పేరు మార్చడాన్ని నిరసిస్తూ ప్రధాని పర్యటన సమయంలో ధర్నా చేసినా కూడా కాసేపు నిర్బంధంలో ఉంచి వదిలేశారు తప్ప పోలీసులు కేసులు మాత్రం నమోదు చేయలేదు.

జగన్ దెబ్బ.. అట్లుంటది మరి!

ఇప్పుడు ఇలా..!

2011లో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సమయంలో రెండున్నర రోజులు మాత్రం మహారాష్ట్ర పోలీసుల నిర్బంధంలో ఉన్నారు అంతే. కేసులు మాత్రం పెట్టలేదు. ఆ తరువాత 2012లో రైతు సమస్యలపై చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలోనూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు కానీ కేసులు పెట్టింది లేదు. ఆ తరువాత ఎన్నో ఘటనలు జరిగినా కూడా చంద్రబాబుపై మాత్రం కేసులు నమోదు చేసింది లేదు. తొలిసారిగా వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు అవినీతిని బయటికి తీసి.. కోట్ల రూపాయల కుంభకోణం బయటికి తెచ్చారు జగన్. బాబు నిజ స్వరూపం ఇదేనని జగన్ ఈ సమాజానికి చాటి చెప్పారు. చూశారుగా బాబు.. జగన్ దెబ్బ..! రెచ్చగొడితే.. ఇష్టానుసారం నోరు, వయసు, సీనియారిటీ ఉంది కాదా.. అని విర్రవీగితే ఎలా ఉంటుందో చూశారుగా.. విధి ఎవర్నీ వదలదు.. మీకు స్కాంతో సంబంధం లేదు కదా.. కడిగిన ముత్యంలా బయటికి రండి అంతే కదా.. లేదంటే జైళ్లో ఊచలు లెక్కించండి.. అంతే కదా..!