సంక్షోభంలో టీడీపీ.. నారా లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఇక అంతే..

సంక్షోభంలో టీడీపీ.. నారా లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఇక అంతే..

ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశం కాక రేపుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైలు నుంచి బయటకు వచ్చేందుకు అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. చివరకు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. నిజానికి టీడీపీకి నేడు బిగ్ డే అని చెప్పాలి. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ నేడు జరగనుంది. ఒకవేళ ఇవాళ జరగలేదంటే మళ్లీ అక్టోబర్ 3 వరకూ వెయిట్ చేయాల్సిందే.

మరోవైపు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు సైతం నేటికి వాయిదా వేసింది. మూడు పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సైతం కేసు మోపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ 14 గా చూపుతూ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టులో లోకేష్ పేరును మెన్షన్ చేస్తూ సిఐడి మెమో దాఖలు చేసింది. ఇది టీడీపీలో మరింత కలవరం రేపుతోంది. నారా లోకేష్ కూడా అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

Advertisement

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అయినా పార్టీని ఆదుకుంటారేమోనంటే ఆయన రాంగ్ ట్రాక్‌లో వెళుతున్నారు. దీనికి మొన్న అసెంబ్లీలో ఆయన చేసిన రాద్దాంతమే ఉదాహరణ. ప్రజా సమస్యలను చర్చించాల్సిన చోట ఈల వేసి, తొడగొట్టి నానా హంగామా సృష్టించారు. పార్టీని నడిపించే వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీస్ ఆయనకు లేవంటూ ఇప్పటికే చర్చ ప్రారంభమైంది.

అయితే నారా బ్రాహ్మిణిని రంగంలోకి దింపుతామంటూ ఆ పార్టీ కీలక నేత అయ్యన్న పాత్రుడు చెప్పారు. మరి బ్రాహ్మిణి రంగంలోకి దిగితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అనే సంశయం పార్టీ కేడర్‌లో నెలకొంది. ఎన్నికల వేళ ఆమె నెగ్గుకురాగలరా? అని చర్చ జరుగుతోంది.

మొత్తానికి ఏపీలో టీడీపీ అయితే సంక్షోభంలోనే ఉంది. ఇవాళ చంద్రబాబుకు బెయిల్ రాకుంటే పార్టీ నేతలు, కేడర్ మరింత నిరాశలో కూరుకుపోయే అవకాశం ఉంది.