ఐటీ మంత్రి ఎక్కడ? రేవంతే ఎందుకు సీన్‌లోకి వస్తున్నారు?
తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనకు ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో చరమ గీతం పాడారు. ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇక అందరి దృష్టి గత ఐటీ మంత్రి కేటీఆర్ మాదిరిగా నెక్ట్స్ వచ్చిన మంత్రి చేస్తారా? లేదా? పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తారా? లేదా? అనే సందేహాలుండేవి. ఆ సందేహాలన్నింటికీ చెక్ పెడుతూ.. రేవంత్ ‘మెగా మాస్టర్ పాలసీ–2050’కి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వృద్ధిపథంలోకి తీసుకొచ్చేందుకు మహాప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలోని అన్ని ప్రాంతాలూ హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధిపథంలోకి తీసుకురావాలనే క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు సైతం ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కనిపించకపోవడమే చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల వ్యవధిలో 5 సార్లు కంపెనీ ప్రతినిధులతో రేవంత్ సమావేశం నిర్వహించారు. కానీ ఈ ఐదు సమావేశాల్లోనూ ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లేరు. ఆయన వేరే ఎక్కడో ఉన్నారంటే ఓకే కానీ హైదరాబాద్‌లో ఉండి రాకపోవడమే హాట్ టాపిక్‌గా మారింది.
అసలు పారిశ్రామిక సమావేశాల్లో రేవంత్ లేకున్నా పర్వాలేదు కానీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లేకుంటే ఎలా? దీనిపై రకరకాల విమర్శలు వినవస్తున్నాయి. ఐటీ, ఇండస్ట్రీస్ శాఖలో పెట్టుబడులు తీసుకొస్తే పబ్లిసిటీ వస్తుందని ఆ శాఖ మంత్రిని రేవంత్ కావాలనే సైడ్ చేశారా? అంటూ ప్రచారం సాగుతోంది. తనకు క్రెడిట్ దక్కడ కోసం సీన్‌లోకి ఐటీ మంత్రిని రానివ్వడం లేదని అంతా చెప్పుకుంటున్నారు. ఇంత మాత్రానికే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ మంత్రిని చేయడమెందుకని ప్రశ్నిస్తున్నారు.