Nayanthara: నయన్‌కు బ్యాడ్ టైమ్.. త్రిషకు పట్టిందల్లా బంగారమే!

నయనతార (Nayanthara), త్రిష(Trisha)… ఈ ఇద్దరూ సీనియర్ నటీమణులే. నటన, అందం, అభినయంలో ఒకరికొకరు ఏ మాత్రం తక్కువ కాదు. పెళ్లి తర్వాత నయన్ అందం కాస్త తగ్గడంతో.. త్రిష (Trisha) తెగ జోరు పెంచేసింది. స్టార్ హీరోల సరసన నటించాలంటే చాలు.. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మొదట గుర్తొచ్చే పేరు లేడీ సూపర్‌స్టార్ నయన్ (Nayanthara). నిన్న, మొన్నటి వరకూ పరిస్థితులు అలా ఉన్నాయ్ కానీ.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాయ్. ఈ మధ్య ముదురుభామ నయన్ నటించిన సినిమాలేమీ పెద్దగా హిట్ కావట్లేదు. పైగా పెళ్లయ్యాక అందం తగ్గిందని ఆమెను చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

‘నాయకి’ (Nayaki) తర్వాత నయన్‌కి తెలుగు, తమిళ్‌లో ఛాన్స్‌లు పెద్దగా రాలేదు. తమిళ సినిమాలపైనే లేడీ సూపర్‌స్టార్ దృష్టిపెట్టినప్పటికీ ఒక్కటంటే ఒక్కటీ కలిసిరాలేదు. నిన్న, మొన్న వచ్చిన ‘కనెక్ట్’ మూవీ థియేటర్‌లలో సందడి చేయలేకపోయింది. ఇంత జరుగుతున్నా ఈ భామ మాత్రం రెమ్యునరేషన్‌లో ఏ మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు.. పెంచుకుంటూ పోతోందే తప్ప అస్సలు తగ్గించట్లేదు. సరిగ్గా ఇదే టైమ్‌లో ఫేడవుట్ అయిన త్రిష (Trisha) ఫామ్‌లోకి వచ్చేసింది. తాను సీనియర్ నటిని కాదు.. కుర్రకారు ఆశ్చర్యపోయేలా అందం, అభినయం మెయింటైన్ చేయాలని.. మొత్తం రూపురేఖలు మార్చేసుకుంది త్రిష. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు తెగ పోస్ట్ చేసేస్తోంది. ఆ పిక్చర్స్ చూసిన జనాలు.. బాబోయ్ అదిరిపోలా ఎవరీ కొత్త బ్యూటీ అనుకునేలా ఉంది.

ఒకప్పుడు నయన్‌ (Nayanthara)ను హీరోయిన్‌గా అనుకున్న మేకర్స్ అంతా త్రిష (Trisha) దగ్గరికి క్యూ కడుతున్నారట. ఇప్పటికే నాలుగైదు సినిమాలకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. తమిళ్‌లో విజయ్, అజిత్‌ సరసన నటించడానికి మేకర్స్ ఈమెను సెలక్ట్ చేసేశారట. అంతేకాదు.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతానికి సమంత, పూజాహెగ్దే, కాజల్, అనుష్క టాప్‌లో ఉన్నారు. సమంత అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఏ సినిమా ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికే సుమారు రెండు, మూడేళ్లు పట్టేలా ఉన్నాయ్. ఇక కాజల్ కూడా.. బిడ్డకు జన్మనిచ్చాక బాడీ ఫిజిక్ పైన దృష్టి పెట్టింది. ఇప్పటికిప్పుడు ఆమె సినిమాలు ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు. అనుష్క అయితే మునుపటిలా లేదు.. ఫామ్‌ ఇప్పట్లో రాకపోవచ్చు కూడా. ఇక మిగిలింది పూజాహెగ్డే.. ఈ పొడుగుకాళ్ల సుందరికి 2022 లో ఒక్కటంటే ఒక్కటీ సినిమా హిట్ కాలేదు. దీంతో గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్‌లా మారిపోయిందట.

ఇదివరకే.. ఒకట్రెండు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు త్రిషను సంప్రదించగా ఆమే తిరస్కరించదని టాక్ నడిచింది. ఈ ముద్దుగుమ్మను సంప్రదించారంటే అర్థమేంటి.. ఆ పాత్రకు ఇంకెవ్వరూ సెట్ కారని.. త్రిష అయితేనే సెట్ అవుతుందనే కదా. సో.. త్రిష ఏమాత్రం ఫామ్ కోల్పోలేదనేగా అర్థం. అందుకే ఇకపై తెలుగు నుంచి కూడా త్రిషకు ఆఫర్లు వెళ్లినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఇకపై త్రిష పట్టిందల్లా బంగారమే కానుందన్న మాట. ఏదైతేనేం.. ఇక టాలీవుడ్, కోలీవుడ్ రెండూ త్రిషకే అన్న మాట. Any Way All the Best త్రిష.. ఇక కానివ్వండి..!

Sootiga Team

Recent Posts

యాక్సిస్ మై ఇండియా కాదు.. యాక్సిస్ తుస్ ఇండియా!!

యాక్సిస్ మై ఇండియా.. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే.. పేరుకే ఇది…

June 2, 2024

పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యే.. కారు ఖాళీ..!

తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకూ బీఆర్ఎస్ మినహా వేరే పార్టీలకు తెలంగాణలో ఛాన్సే లేకుండా పోయింది. అయితే…

June 2, 2024

కూటమికి అనుకూలంగా సర్వేలు..

ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఎప్పుడు వెలువడతాయా? అని ఏపీ ప్రజానీకం నరాలు తెగే ఉత్కంఠతో పార్టీలన్నీ ఎదురు చూశాయి.…

June 2, 2024

అమలాపాల్ ప్రెగ్నెన్సీ.. అది ఉత్త ఫేక్ అట..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు అయితే ఎక్కువగా నెట్టింటే కాలం గడిపేస్తున్నారు. కెరీర్, పర్సనల్ విషయాలను కొందరు హీరోయిన్లు…

June 2, 2024

సర్వేలన్నీ వైసీపీకే పట్టం.. జయహో జగన్!!

ఎన్ని సర్వేలు వచ్చినా సరే గెలుపు వైసీపీదే..! వరుసగా రెండోసారి వైఎస్ జగన్‌దే సీఎం పీఠం అని తేల్చేశాయ్..! ఒక్కడు…

June 2, 2024

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: మళ్ళీ జగనే

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఇప్పటికే పలు సర్వేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండోసారి అధికార పగ్గాలు…

June 1, 2024