‘భీమా’ ట్విటర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

మ్యాచో స్టార్ గోపీచంద్,  మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమా’. క‌న్నడ ద‌ర్శకుడు ఏ హ‌ర్ష దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్‌కు ఈ సినిమా హిట్ అందించినట్టేనా? వంటి ప్రశ్నలకు సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో సమాధానమిస్తున్నారు.

యాక్షన్ ఎపిసోడ్స్‌కి తోడు కామెడీ సీక్వెన్స్ సమపాళ్లలో ఉందని ప్రేక్సకులు చెబుతున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో పటు క్లైమాక్స్ బాగుందని చెబుతున్నారు. గోపిచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీశాడట. హీరోకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్‌లో ఆయన రోల్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందట. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అయితే గోపీచంద్ అదరగొట్టాడట. పరుశురామ క్షేత్రం ఎపిసోడ్‌ అనేది సినిమాకి హైలైట్ అని ప్రేక్షకులు అంటున్నారు.

ఈ చిత్రానికి క్లైమాక్స్ కూడా మరో మేజర్ హైలైట్ అని ప్రేక్షకులు అంటున్నారు. ‘‘నీ కటౌట్‌కి పడాల్సిన సినిమా భీమా అని నా స్ట్రాంగ్ ఫీలింగ్… మాచో స్టార్ నుంచి బ్లాక్ బస్టర్ ఆశిస్తున్నా..’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ మధ్య కాలంలో గోపిచంద్ సినిమాలతో పోలిస్తే భీమా చాలా బాగుందని చెబుతున్నారు. ఇక సినిమా ఫుల్ రివ్యూ వస్తే కానీ ఎలా ఉందన్న విషయంలో పూర్తి క్లారిటీ రాదు. ఇప్పటి వరకూ చూసిన ప్రేక్షకులు మాత్రం.. గోపీచంద్‌కి ‘భీమా’ బిగ్ రిలీఫ్ అనే అంటున్నారు.

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024