ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వలంటీర్ల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని.. పవన్ కల్యాణ్.. ఆఖరికి ఆ పార్టీల నేతలు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడేసి.. ఇప్పుడు మాత్రం ‘సాంప్రదాయని.. సుప్పినీ.. సుద్దపూసనీ..’ అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు రెండొందల సార్లు వలంటీర్ల వ్యవస్థ, వారి పనితీరుపై చంద్రబాబు నాలుక మడతేసి ఉంటారు. చివరాఖరికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, మూడుసార్లు ముఖ్యమంత్రి.. దేశానికి ప్రధానులు, రాష్ట్రపతులను నిర్ణయించిన చంద్రబాబు.. వలంటీర్లను కాకా పడుతూ నిద్ర లేచింది మొదలుకుని నిద్రపోయే వరకూ వారిపేరు తలచనిదే పూట గడవట్లేదు. పెన్షన్ల పంపిణీ చేయకుండా వలంటీర్లను దూరం చేయడం.. పదే పదే ఈ వ్యవస్థపై యూటర్న్‌లు తీసుకోవడం నచ్చక వేలాది మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటికొచ్చేశారు. ఇప్పుడు ఏకంగా 800 మంది రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. వీరంతా జగన్ కోసం స్వచ్చందంగా పనిచేయడానికి సిద్ధం అంటున్నారు. జగనన్న కోసం మండపేటలో 800 మంది గ్రామ/వార్డు వలంటీర్లు రాజీనామా చేశారు.
రాజీనామా.. రణరంగంలోకి!
జన క్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. జగన్‌కు జనం పెద్ద ఎత్తున నీరాజనం పలకడాన్ని విపక్ష నేతలు తట్టుకోలేక ఇలా దాడులు చేస్తుండటంతో చలించిపోయిన వలంటీర్లు ఇక.. రాజకీయ రణరంగంలోకి దూకాల్సిందేనని తమ పదవులకు రాజీనామా చేసి వచ్చేస్తున్నారు. వాస్తవానికి జగన్‌పై జరిగిన దాడి.. వలంటీర్లలో పెను మార్పే తీసుకొచ్చింది. జగన్ పై దాడి జరిగిన తర్వాత ఇక పదవులు వద్దు.. ఏమీ వద్దు.. జగనే ముద్దు అంటూ తమ పదవులకు రాజీనామాలు చేసి మరీ వలంటీర్లు రంగంలోకి దిగుతున్నారు. జగన్‌ను తిరిగి గెలిపించి.. అధికార పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా పని చేసేందుకు వలంటీర్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రాజీనామాలు ఊపందుకుంటున్నారు. ఒక్క రోజే 800 మంది రాజీనామా చేసి విపక్షాలకు షాక్ ఇచ్చారు.
మేమంతా సిద్ధమే!
రాజీనామా చేసిన తర్వాత తమ పరిస్థితేంటన్నది వలంటీర్లు అస్సలు ఊహించట్లేదు. ఎందుకంటే.. వైసీపీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపైనేనని జగన్ భరోసా ఇవ్వడంతో ఇక తగ్గేదేలా అంటూ.. జగనన్న కోసం మేము సైతం.. మేమంతా సిద్ధం అంటూ వారికి తోచిన, వారి వంతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీకి ఓట్లు పడేలా చేయడంలో అహర్నిశలు కష్టపడుతున్నారు. వైఎస్ జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ఈ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు సైతం అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యవస్థపైనే చంద్రబాబు నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడూతూ.. ఇప్పుడిక పదివేలిస్తాం.. తీసేయం.. అంతా మేమే చూసుకుంటామని చెబుతుండటం సిగ్గుచేటని వలంటీర్లు చెబుతున్నారు. అందుకే.. అధికారంలో ఉన్నా లేకున్నా.. ఉద్యోగం ఉన్నా లేకున్నా జగన్ వెంటే అని వలంటీర్లు అడుగులేస్తున్నారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…