సీబీఐ.. ఎలాంటి కేసునైనా ఛేదించడంలో దిట్ట. పెద్దపెద్ద కేసుల గుట్టును సైతం ఇట్టే విప్పగల ఢిల్లీ స్థాయిలోని అతిపెద్ద దర్యాప్తు సంస్థ . నేరస్థులు ఎంతటివారైనా డేగకళ్లతో వేటాడుతుంది. కానీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో మాత్రం అట్టర్ ఫ్లాప్ అని ఓ జాతీయ స్థాయి ఇంగ్లీష్ వెబ్ సైట్ తేల్చి చెప్పింది. వైఎస్ వివేకానంద హత్య కేసులో మాత్రం నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా ఏమీ తేల్చలేదని.. ఏళ్లకేళ్లు గడుస్తున్నా ఆ హత్యకేసును సంబంధించి ఒక్క ఆధారమూ సేకరించలేదని ఆంగ్ల వెబ్ సైట్ వెల్లడించింది. ఎక్కడో దొరికిన ఒక కాగితం ముక్కనో, ఓ చెక్కముక్కనో పట్టుకుని అదే ఆధారం అని నమ్మించేందుకు ప్రయత్నిస్తోందని సదరు వెబ్ సైట్ తెలిపింది. ఈ అసమర్థతను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ది వైర్ ఆంగ్ల వెబ్‌సైట్ పలు కోణాల్లో వివరించింది. ఇన్నాళ్లలో సీబీఐ సాధించింది శూన్యమని ఆ వెబ్‌సైట్ స్పష్టం చేసింది. దర్యాప్తు మొత్తం ఒకే కోణంలో సాగిందని, ఆయన హత్యకు వేరే కారణాలు ఉండొచ్చన్న భావన కూడా సీబీఐకి రాలేదంటూ ఆ వెబ్‌సైట్ పలు ప్రశ్నలు సంధించింది. అంటే మనసులో ఏదో పెట్టుకుని, అప్పటికే నిందితుడిని సెలెక్ట్ చేసుకుని ఆయన్ను నిజంగానే నిందితుడిగా రుజువు చేసేందుకు ఆధారాలు వెతుకుతున్న సీబీఐ తీరును ఆ వెబ్‌సైట్ అభిశంసించింది.
అవినాష్‌కు మద్దతుగా వివేకా ప్రచారం నిర్వహించారు..
ది వైర్ కథనం ప్రకారం.. వాస్తవానికి కడప ఎంపీ టికెట్ కోసం ఈ హత్య జరిగింది అన్నట్లుగా సీబీఐ వాదన ఉంటోంది. కానీ అప్పటికే కడప టికెట్ అవినాష్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకటించేసారు. అంతేకాదు ఆ ప్రకటన వచ్చాక అవినాష్‌కు మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు. ఆ విషయాన్ని సీబీఐ అసలు పట్టించుకోనేలేదు. కేవలంఎంపీ టికెట్ కోసమే వివేకా, అవినాష్ రెడ్డి మధ్య పోటీ ఉన్నట్లు భావిస్తూ ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ వెళ్ళింది. కానీ దానికి సంబంధించి ఒక్క ఆధారమూ సంపాదించలేకపోయింది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆయనకు ఈ హత్యతో ప్రమేయం ఉందని చెప్పే ఒక్క ఆధారమూ కోర్టుకు చూపలేదు.
బలహీనమైన అభ్యర్థి అని వివేకా ఎలా భావిస్తారు?
అసలు అవినాష్ రెడ్డి బలమైన అభ్యర్థి కాదని వివేకా భావించారు అంటూ వైఎస్ షర్మిళ గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మహాప్రసాదంగా తీసుకుని ముందుకు వెళ్లిన సీబీఐ అసలు అవినాష్ ట్రాక్ రికార్డ్ గుర్తించలేదు. 2014లో 1. 90 వేల ఓట్ల మెజారిటీ ఇంకా 2019లో 3. 80 లక్షల మెజారిటీతో గెలిచారు. అయన మెజారిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు. మరి అలాంటపుడు అవినాష్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకా ఎలా భావిస్తారు. ఈ పాయింట్ ఎందుకు సీబీఐ మర్చిపోయింది. పోనీ షర్మిళ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారం ఉందా అంటే అదీ లేదు. ఆమె అలా చెప్పారు కాబట్టి ఆ పాయింట్ మీద ఫిక్స్ అయిపోయి దర్యాప్తు చేస్తూ వెళ్లారు. ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ రెడ్డి కారణం అని సీబీఐ చెబుతోంది తప్ప దీనికీ ఆధారాల్లేవు.
రెండో పెళ్ళికి సునీత, సౌభాగ్యమ్మ వ్యతిరేకం
అయితే షమీమ్ అనే మహిళను వివేకా రెండో పెళ్లి చేసుకోవడం ఇటు ఆయన కూతురు సునీతకు, భార్య సౌభాగ్యమ్మకు ఇష్టంలేదని, అందుకే ఆయనకు ఉన్న చెక్ పవర్ సైతం లాగేసుకున్నారన్నది అందరికీ తెలిసిందే. ఇక సౌభాగ్యమ్మ సోదరులు తనను బెదిరించినట్లు షమీమ్ వెళ్లి సీబీఐ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. మరి ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారించలేదు? ఆ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చనే కోణం ఎందుకు సీబీఐ తీసుకోలేదు? హత్యకు ఏయే కారణాలు ఉండొచ్చన్న సందేహాలు సీబీఐ మదిలో మెదిలి, ఇలా పలుకోణాల్లో విచారణ జరపాల్సి ఉండగా సీబీఐ అదేమీ పట్టించుకోకుండా కేవలం ఒకే కోణంలో అది కూడా అవినాష్ కు అందులో పాత్ర ఉందన్న విషయాన్నీ నిరూపించడానికి ఎక్కువ తాపత్రయపడింది.. ఇలా పలు కీలక అంశాలు వదిలేసి ఎటెటో దర్యాప్తు బృందం వెళ్ళిపోయి ఏమీ సాధిచకుండా నాలుగేళ్లు గడిపేసింది అంటూ సీబీఐని ది వైర్ వెబ్‌సైట్ దుయ్యబట్టింది. ఇన్నాళ్ల సమయంలో సీబీఐ దర్యాప్తు మొత్తం సరైనమార్గంలో వెళ్లలేదని, దారితప్పి విచారణ జరిగిందని వైర్ తన కథనంలో విశ్లేషించింది.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…