బీజేపీ పార్టీ నాయకుడు కాంగ్రెస్ కి డబ్బు ఇవ్వడం చాలా విచిత్రం. ఇలాంటి వింతలు, విడ్డూరాలు ఓన్లీ తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లి అక్కడ ఉండి బాబు కోసం పనిచేసే వారి వల్లే జరుగుతుంటాయి కాబోలు. సీఎం రమేష్ తెలుగు దేశం పార్టీ నుంచి 2019లో బీజేపీలో చేరారు. పేరుకే ఆయన బీజేపీ నాయకుడు. కానీ మనసా వాచా తెలుగుదేశం పార్టీతోనే.
చంద్రబాబునాయడు కోసం పనిచేసే నాయకుల్లో అతను ఒకరు. ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్‌కు రూ.30 కోట్ల నిధులు ఎలోక్టరల్ బాండ్ల ద్వారా చేరాయి. ఆ బాండ్ల సీరియల్ నెంబర్స్ ఇవే….
14402, 14412, 14414, 14416,14418, 14420,14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477.
సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ నుంచి కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు వెళ్లడం వింతే.
తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ వేరువేరు కాదని, ఆంధ్రపదేశ్ లో కాంగ్రెస్‌ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి నడిపిస్తున్నాడని మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలైంది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది.
చంద్రబాబు నాయిడు సీఎం రమేష్ ని బీజేపీలోకి పంపింది అందుకేనా?
తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా సీఎం రమేష్ ని ఉన్నట్టుండి బీజేపీలోకి చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ ప్రకారం పంపారు అని అప్పట్లోనే ప్రచారం జరిగింది. కేసుల నుంచి తప్పించుకునేందుకు సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి తెలుగుదేశం నాయకులు బాబు వేసిన స్కెచ్ ప్రకారమే బీజేపీలో చేరారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అలాగే ఇప్పుడు షర్మిల వెనుక కూడా వీళ్ళే ఉన్నారు అని వైఎస్సార్పీసీ ఆరోపిస్తోంది.
“శిష్యుడు రేవంత్ రెడ్డితో కలిసి షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనమయ్యేలా చేసి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ చిల్లర ఖర్చుల కోసం రూ.30 కోట్లు ఇచ్చారు. ఇదంతా ఒక ప్లాన్,” అని జగన్ పార్టీ నాయకులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
రమేష్ కంపెనీ బాండ్లు ఇలా
సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ 2023లో రూ.45 కోట్ల మేర ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేసి అందులో రూ.30 కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి, రూ.5 కోట్లను టీడీపీ ఖాతాలోకి, మరో 10 కోట్ల రూపాయలు కర్ణాటకకు చెందిన జేడీఎస్‌లోకి పంపారట. ఎలొక్టరల్ బాండ్లను జాగ్రత్తగా విశ్లేషిస్తే అర్థమైంది ఇదే అని అంటున్నారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…