తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ ఊహించని ట్విస్టులు.. సిట్టింగులు, ఆశావాహుల్లో ఒక్కటే టెన్షన్.. ఊహించని రీతిలో షాకులు.. వీటన్నింటికీ తెరదించుతూ గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఒకే ఒక్క ప్రకటన.. అది కూడా నిమిషాల వ్యవధిలోనే ముగించేశారు. రెండు, మూడు జాబితాలుగా అభ్యర్థులను ప్రకటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ సారు.. కారు.. ఒక్కటే అన్నట్లుగా ఒకే ఒక్క జాబితాతో ప్రతిపక్షాలకు ఊహకందని రీతిలో ప్రకటన చేసేశారు. ముందుగా 80 నుంచి 89 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఒక్కటే దెబ్బతో 115 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. తాజాగా ప్రకటించిన జాబితాను బట్టి చూస్తే కేసీఆర్ మరోసారి తన ప్రత్యేకత, డేరింగ్‌ను చాటుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే గులాబీ బాస్.. మాత్రం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీచేస్తానని ప్రకటించడం గమనార్హం. ఇది నిజంగా పెద్ద ట్విస్టే అని చెప్పుకవోచ్చు. అయితే రెండు చోట్ల కేసీఆర్ ఎందుకు పోటీచేయాలని భావించారన్నది బీఆర్ఎస్ పెద్దలకే అర్థం కాని పరిస్థితి.
115 మంది అభ్యర్థులు వీరే..
కాగా.. 115 మంది అభ్యర్థుల్లో 40 మంది రెడ్లు, 12 మంది వెలమా, ఒకే ఒక్కరు వైశ్య, ఇద్దరు బ్రాహ్మణ, నలుగురు కమ్మ, 29 మంది ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లు, ముగ్గురు మైనార్టీలకు, 24 మంది బీసీలకు కేసీఆర్ సీట్లు ఇచ్చారు.
1.సిర్పూర్ – కోనేరు కోనప్ప
2. చెన్నూరు (ఎస్సీ)- బాల్క సుమన్
3.బెల్లంపల్లి (ఎస్సీ)- దుర్గం చిన్నయ్య
4.మంచిర్యాల్ – నడిపెల్లి దివాకర్ రావు
5. అసిఫాబాద్ (ఎస్టీ) – కోవా లక్ష్మీ
6. ఖానాపూర్ (ఎస్టీ) – భూక్యా జాన్సన్ రాథోడ్నాయక్
7.ఆదిలాబాద్ – జోగు రామన్న
8.బోథ్ (ఎస్టీ) – అనిల్ జాదవ్
9.నిర్మల్ – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
10.ముథోల్ – విఠల్ రెడ్డి
11.ఆర్మూర్ – ఆశన్నగారి జీవన్ రెడ్డి
12.బోధన్ – మహమ్మద్ షకీల్ ఆమిర్
13.జుక్కల్ (ఎస్సీ) – హన్మంత్ శిందే
14.బాన్స్వాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి
15.యల్లారెడ్డి- జాజుల సురేందర్
16.కామారెడ్డి – కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)
17.నిజామాబాద్ అర్బన్ – బిగాల గణేశ్ గుప్తా
18.నిజామాబాద్ రూరల్ – గోవర్దన్ బాజిరెడ్డి
19.బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి
20.కోరుట్ల – డా. సంజయ్ కల్వకుంట్ల
21.జగిత్యాల్ – డా సంజయ్ కుమార్
22.ధర్మపురి (ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్
23.రామగుండం – కోరుకంటి చందర్
24.మంథని – పుట్టా మధు
25.పెద్దపల్లి – దాసరి మనోహర్‌రెడ్డి
26.కరీంనగర్ – గంగుల కమలాకర్
27.చొప్పదండి (ఎస్సీ)- సుంకె రవిశంకర్
28.వేములవాడ -చల్మెడ లక్ష్మీనరసింహారావు
29.సిరిసిల్ల – కేటీఆర్
30.మానకొండూరు (ఎస్సీ) – రసమయి బాలకిషన్
31.హుజూరాబాద్ – పాడి కౌశిక్ రెడ్డి
32.హుస్నాబాద్ – సతీశ్ కుమార్
33.సిద్దిపేట – హరీశ్‌రావు
34.మెదక్ – పద్మా దేవేందర్‌రెడ్డి
35.నారాయణఖేడ్ – మహారెడ్డి భూపాల్ రెడ్డి
36.అంథోల్ (ఎస్సీ) – చంటి క్రాంతి కిరణ్
37.నర్సాపూర్ – (అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది)
38.జహీరాబాద్ (ఎస్సీ) – కె.మాణిక్ రావు
39.సంగారెడ్డి – చింతా ప్రభాకర్
40.పటాన్చెరు – గూడెం మహిపాల్‌రెడ్డి
41.దుబ్బాక- కొత్త ప్రభాకర్ రెడ్డి
42.గజ్వేల్- కేసీఆర్
43.మేడ్చల్- చామకూర మల్లారెడ్డి
44.మల్కాజ్గిరి- మైనంపల్లి హనుమంతరావు
45. కుత్బుల్లాపూర్- వివేకానంద
46. కూకట్పల్లి-మాధవరం కృష్ణారావు
47.ఉప్పల్ -బండారు లక్ష్మారెడ్డి
48.ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
49.ఎల్బీనగర్ – దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
50.మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
51.రాజేంద్రనగర్ – ప్రకాశ్ గౌడ్
52.శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ
53.చేవెళ్ల (ఎస్సీ)- కాలే యాదయ్య
54.పరిగి – కొప్పుల మహేశ్ రెడ్డి
55.వికారాబాద్ (ఎస్సీ)- డా. మెతుకు ఆనంద్
56.తాండూరు – పైలట్ రోహిత్ రెడ్డి
57.ముషీరాబాద్ – ముఠా గోపాల్
58.మలక్‌పేట – తీగల అజిత్ రెడ్డి
59.అంబర్పేట్ – కాలేరు వెంకటేశ్
60.ఖైరతాబాద్ – దానం నాగేందర్
61.జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్
62.సనత్‌నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్
63. నాంపల్లి -(అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉంది)
64. కార్వాన్ – ఐందల కృష్ణయ్య
65.గోషామహల్- (అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉంది)
66. చార్మినార్ – ఇబ్రహీం లోడీ
67.చాంద్రాయణ గుట్ట- ఎం సీతారామ్ రెడ్డి
68. యాకుత్ పుర- సామ సుందర్ రెడ్డి
69. బహుదూర్‌పుర- అలీ బక్రీ
70. సికింద్రాబాద్ – టి పద్మారావు
71. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ)- లాస్య నందిత
72. కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి
73. నారాయణపేట్- రాజేందర్ రెడ్డి
74. మహబూబ్‌నగర్ – శ్రీనివాస గౌడ్ విరుసనోళ్ల
75. జడ్చర్ల – చర్లకోల లక్ష్మారెడ్డి
76. దేవరకద్ర- ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి
77. మక్తల్- చిట్టెం రామ్ మోహన్ రెడ్డి
78. వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
79. గద్వాల్- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
80. అలంపూర్ (ఎస్సీ)- వీఎం అబ్రహం
81. నాగర్‌కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి
82. అచ్చంపేట (ఎస్సీ)- గువ్వల బాలరాజు
83. కల్వకుర్తి- గుర్క జయపాల్ యాదవ్
84. షాద్‌నగర్ – అంజయ్య ఎల్గనమోనీ
85. కొల్లాపూర్- బీరం హర్షవర్దన్ రెడ్డి
86. దేవరకొండ (ఎస్టీ)- రవీంద్ర కుమార్ రమావత్
87. నాగార్జున సాగర్- నోముల భగత్
88. మిర్యాలగూడ- నల్లమోతు భాస్కర రావు
89. హుజూర్ నగర్- శానంపూడి సైదిరెడ్డి
90. కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్
91. సూర్యపేట- జగదీశ్ రెడ్డి
92. నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
93. మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
94. భువనగిరి – పైళ్ల శేఖర్‌రెడ్డి
95. నకిరేకల్ (ఎస్సీ) – చిరుమర్తి లింగయ్య
96. తుంగతుర్తి (ఎస్సీ)- గాదరి కిషోర్ కుమార్
97. ఆలేరు – గొంగిడి సునీత
98 .జనగామ – (అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది)
99.స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) – కడియం శ్రీహరి
100. పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు
101. డోర్నకల్ – డీఎస్ రెడ్యా నాయక్
102. మహబూబాబాద్ (ఎస్టీ) – బానోతు శంకర్ నాయక్
103. నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి
104 .పరకాల – చల్లా ధర్మా రెడ్డి
105.వరంగల్ వెస్ట్ – దాస్యం వినయ్ భాస్కర్
106 .వరంగల్ ఈస్ట్ – నన్నపునేని నరేందర్
107. వర్దన్నపేట (ఎస్సీ) – ఆరూరి రమేశ్
108. భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
109. ములుగు (ఎస్టీ) – బడే నాగజ్యోతి
110. పినపాక (ఎస్టీ) – రేగా కాంతారావు
111. ఇల్లందు (ఎస్టీ) – బానోతు హరిప్రియ నాయక్
112. ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్
113. పాలేరు – కందాల ఉపేందర్ రెడ్డి
114. మధిర (ఎస్సీ) – లింగాల కమల్ రాజు
115. వైరా (ఎస్టీ) – బానోతు మదన్‌లాల్
116. సత్తుపల్లి (ఎస్సీ) – సండ్ర వెంకట వీరయ్య
117. కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర రావు
118. అశ్వారావుపేట (ఎస్టీ) -మెచ్చా నాగేశ్వరరావు
119. భద్రాచలం (ఎస్టీ) – తెల్లం వెంకటరావు
మార్పులు, చేర్పులు ఇలా..!
వాస్తవానికి గత రెండు మూడు నెలలుగా 20 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ఎవరూ ఊహించని రీతిలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే మార్చారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు 115 స్థానాలకు అభర్ధులను ప్రకటించారు. జనగామ, నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్ స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. కాగా.. ఉప్పల్ సీటును సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ సీటును తాడికొండ రాజయ్య, వైరా నుంచి రాములు నాయక్, ఖానాపూర్ నుంచి రాములు నాయక్, వేములవాడ నుంచి చెన్నమనేని రమేష్, కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్, బోధ్ నుంచి రాథోడ్ బాపురావు, కోరుట్ల నుంచి విద్యాసాగర్ రావు, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు సీట్లను కోల్పోయారు. అయితే.. హుజారాబాద్ నుంచి కౌశిక్‌రెడ్డి, ఉప్పల్ నుంచి బండారి లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి, ములుగు నుంచి నాగజ్యోతి, ఇల్లందు నుంచి హరిప్రియ నాయక్ పోటీచేస్తున్నారు. వీరంతా కొత్త ముఖాలే.
భారీ ర్యాలీ.. మేనిఫెస్టో ప్రకటన
కాగా.. అక్టోబర్ 16న వరంగల్‌లో బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహిస్తుందని కేసీఆర్ చెప్పారు. అయితే.. అదే రోజు పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటన చేయబోతున్నారు. ఇదిలా ఉంటే..
కమ్యూనిస్టుల దారెటు? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సీపీఎం, సీపీఐ అడిగిన సీట్లలో తమ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించేశారు. వాస్తవానికి ఈ సీట్ల విషయంలో వామపక్ష పార్టీల నేతలు చాలా ఓవరాక్షన్ చేయడంతో కేసీఆర్ ఇగో హర్ట్ అయ్యిందని టాక్. అందుకే.. పొత్తులో భాగంగా కమ్యూనిస్టులు ఆశించిన మునుగోడు, పాలేరు, బెల్లంపల్లి, కొత్తగూడెం, హుస్నాబాద్ సీట్లలో తమ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్, కమ్యూనిస్టుల పొత్తుపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు, ఖమ్మంలో ఉన్న తమ్మినేని వీరభద్రం పోటీచేయబోతున్నారు.
పెద్ద ట్విస్టే ఇచ్చారుగా..!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు ప్రకటించిన ఈ 115 మంది అభ్యర్థులు ఫైనల్ కాదు. పరిస్థితులను బట్టి అభ్యర్థులను మార్చే అవకాశం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. దీంతో అభ్యర్థుల గుండెల్లో బుల్లెట్ దించినట్లయ్యింది. మరోవైపు.. ఇవాళ ఉదయం తనకు, తన కుమారుడికి టికెట్ ఇస్తే సరే లేకుంటే మంత్రి హరీష్ రావుని బట్టలూడదీసి కొడతానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ జాబితాలో మైనంపల్లి పేరు ఉండటం గమనార్హం. మైనంపల్లి పోటీ చేస్తారా లేదా అన్నది ఆయనిష్టం అని కేసీఆర్ ప్రకటించేశారు. మరి.. మున్ముందు ఎన్నెన్ని మార్పులు, చేర్పులు ఉంటాయో వేచి చూడాల్సిందే మరి.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…