విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం చూపుతిప్పుకోనివ్వదు. మొత్తానికి ఏపీ సీఎం జగన్ ఒక సరికొత్త చరిత్రకు నాంది పలికారు. అలాగే ప్రతిష్టా కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం మరింత ఆసక్తికరంగానూ.. ఆలోచనాత్మకంగానూ మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రసంగం హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రసంగంలో భాగంగా జగన్ పెత్తందారీ వ్యవస్థను ఏకిపారేశారు. పేదల పట్ల మీడియా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఒకప్పుడే కాదు.. ఇప్పుడు కూడా అంటరానితనం మన సమాజంలో ఉందని.. కాకపోతే అది తన రూపు మార్చుకుని సమాజాన్ని కాల్చుకుతింటోందన్నారు.
పేద పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగానే ఉండిపోవాలా?
పేదలు చదివే స్కూళ్లను పట్టించుకోకపోవడం.. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం.. పేదలు ప్రయాణించే ఆర్టీసీని .. పేదప్రజలు వచ్చే ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేయడం.. పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే వికృత వార్తలు రాయడం వంటివన్నీ అంటరానితనమేనని జగన్ అన్నారు. వెనుకబడిన వర్గాల ఎదుగుదలను మీడియా సంస్థలు సహించడం లేదన్నారు. పేద పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగానే ఉండిపోవాలా? అంటూ ఎల్లో మీడియాని కడిగిపారేశారు. ఇక పెత్తందారీ పోకడలు చెల్లవని.. పేదలకు అండగా తానున్నాని.. ఎప్పటికీ ఉంటానని అణగారిన వర్గాలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం దక్కిందన్నారు. ఏపీ శాసనమండలిలో బలహీన వర్గాలకు చెందిన సభ్యులు 29 మంది ఉండటమే దీనికి నిదర్శనమన్నారు.
సామాజిక చైతన్యవాడలా విజయవాడ..
తమ పార్టీ 8 మందిని రాజ్యసభకు పంపితే వారిలో సగం మంది బీసీ, ఎస్పీలేనని తెలిపారు. అలాగే జడ్పీ చైర్మన్ల విషయానికి వస్తే 13 మందిలో 9 మంది బలహీనవర్గాలకు చెందిన వారేనని జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యమేంటో పై లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. అసలు పెత్తందారులకు అంబేద్కర్ అంటేనే అసహ్యమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు దళిత, బలహీన వర్గాలపై ప్రేమనేదే లేదన్నారు.
మనం ఎక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పదం విన్నా కూడా ఇకపై విజయవాడ గుర్తొస్తుందని జగన్ అన్నారు. విజయవాడ సామాజిక చైతన్యవాడలా కనిపిస్తోందని పేర్కొన్నారు. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. దళితజాతికి, బహుళజనులకు అభినందనలు తెలియజేస్తూ సాగించిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…