నారాయణ కాలేజీల చైర్మన్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తనను లైంగికంగా వేధించారని, హింసించారని అయన సొంత మరదలు ప్రియ పొంగూరు ఆరోపణలు చేసింది. ప్రియ ఆరోపణలు, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికలుగా రాష్ట్రంలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ రచ్చ అయ్యాయి. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎల్లోమీడియా కానీ, రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి సంక్షేమానికి కంకణం కట్టుబడి ఉన్నానని చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్‌గానీ రెండ్రోజులుగా చప్పుడు చేయడం లేదు. అదేంటి రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రాజకీయ మిత్రుడు నారాయణ, తన మరదలు పట్ల వ్యవహరించిన తీరుపై కిక్కురుమనకపోవడం విడ్డూరం. అయన ఏదైనా విషయం తనకు రాజకీయంగా ప్రయోజనకరం అంటేనే స్పందిస్తారని.. లేదంటే తనకు కనబడదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టీడీపీలో మొదటి నుంచీ ఈ అరాచకాలు ఉన్నాయని.. ఇది మొదటిది కాదని.. చివరిది కాదని తెలిపింది.
ఆ కేసు అప్పట్లో పెద్ద సంచలనం..
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పార్టీలోని వారిని, కుటుంబీకులను లేదా ఆర్థిక సాయం చేసిన నెపంతో బయటివారిని సైతం లైంగికంగా లేదా శారీరకంగా మానసికంగా వేధించడం కొత్తకాదని వైసీపీ నేతలు అంటున్నారు. అవసరానికి పేదలకు పదివేలు అప్పు ఇచ్చి లక్ష రూపాయలు వసూలు చేసింది చాలక తల్లీ బిడ్డను, ఒకే ఇంట్లోని అక్కాచెల్లెళ్లను లైంగికంగా హింసించిన ఘటనలు కోకొల్లలు అని లెక్కలు తీసి మరీ చెబుతున్నారు. విజయవాడ కాల్ మనీ కేసు అప్పట్లో రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందేనని గుర్తు చేస్తున్నారు. ఇక మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం తన కుమారుడు శివరామకృష్ణతో కలిసి కోడలు పద్మప్రియను వేధించిన కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇక ప్రస్తుతం సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, అయన భార్య, కొడుకు నాగరాజు సైతం కోడలి కీర్తిని వేధించిన కేసుల్లో విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా నారాయణ ఏకంగా తన తమ్ముడి భార్య ప్రియను లైంగికంగా వేధించడం సంచలనం అయింది. అప్పట్లో సినీ నటి కవిత, దివ్య వాణి సైతం ఇలాగె పార్టీలో తమకు జరిగిన అవమానాలు, ఇబ్బందులను సమాజానికి ఏకరువు పెట్టి పార్టీకి ఒక దండం అంటూ నిష్క్రమించారు
ఆ మాటలకు విలువలేదు.. పట్టించుకోవద్దు..
ఇదిలా ఉండగా తమకు , తమ ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని గుర్తించిన మరుక్షణమే టీడీపీ నాయకులు, పెద్దలు లైన్‌లోకి వస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. వెంటనే తమను, తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చి అసలు విషయాన్ని నీరుగారుస్తారని చెబుతున్నారు. అప్పట్లో తన ఇంటిలో సెక్యూరిటీ గార్డులు ఇద్దరినీ కాల్చి చంపిన బాలకృష్ణ సైతం కేసునుంచి తప్పించుకునేందుకు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని బయటపడ్డారని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రియా పొంగూరుకు పిచ్చి ఉందని, అందుకే ఆమె ఏదేదో మాట్లాడుతున్నారని ఆమె భర్త, నారాయణ సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం చెప్పడం దీనికి మరో ఉదాహరణ. అంటే ఆమె పిచ్చిది కాబట్టి అలా మాట్లాడుతోంది కాబట్టి.. ఆ మాటలకు విలువలేదు.. పట్టించుకోవద్దని చెబుతూ ఆ అంశాన్ని డైల్యూట్ చేస్తున్నారు.
పవన్ స్పందించాల్సిన అవసరం లేదా?
వాస్తవానికి ప్రియ పొంగూరు జనసేన సానుభూతిపరురాలు అని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ వివాదాస్పద కామెంట్స్ చేసినపుడు ప్రియ ఆయనకు అండగా నిలబడ్డారని చెబుతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశం మీద పవన్ చేసిన ఆరోపణలు, లేవనెత్తిన ప్రశ్నలకు ప్రియా మద్దతు తెలుపుతూ పవన్ అడిగిన సందేహాలకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టర్, ఫోటో ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మరి తనకు మద్దతుగా నిలిచిన మహిళా ఇప్పుడు లైంగిక వేధింపులకు గురవుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం లేదా? వీర మహిళకు అన్యాయం జరుగుతున్నా అయన వినబడనట్లే, కనబడనట్లే ఉంటారా? కనీసం ఎల్లో మీడియా అయినా ఈ అంశాన్ని ప్రశ్నించాలి కదా అనే అభిప్రాయాలు వైసీపీ నేతల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…