జగనన్న సురక్ష సూపర్ హిట్.. ప్రజలకు డబ్బు, సమయం ఆదా.. లక్షల్లో సర్టిఫికెట్లు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాన్య ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ చేపట్టని ఓ అద్బుత కార్యక్రమాన్ని కూడా తాజాగా చేపట్టారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం కావాలని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్ని నెల పాటు నిర్విఘ్నంగా కొనసాగి ఈ నెల 31న ముగిసింది. ఈ మహా ఉద్యమంలో ఎంతోమంది వలంటీర్లు, సచివాలయ, రెవెన్యూ సిబ్బంది తమ వంతు సేవలందించారు. ప్రతి కుటుంబాన్ని పలకరించి, వారికి ప్రభుత్వంతో ఉన్న సహాయ సహకారాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. జగనన్న సురక్ష అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా జులై 1 నుంచి 31 వరకు నెలరోజులపాటు ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చే ఈ ప్రత్యేక కార్యక్రమం తాజాగా ముగిసింది. 

ప్రజలకు డబ్బు, సమయం ఆదా..

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,004 గ్రామా సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరం అయ్యే కులం, ఆదాయం, నివాసం వంటి ఇతర ధ్రువీకరణ పత్రాలకు అక్కడే దరఖాస్తులు స్వీకరించడం,  ఇంటింటికి వెళ్లి వెనువెంటనే అక్కడికక్కడే వాటిని మంజూరు చేయడం జరిగింది. ఈ  ప్రక్రియ ద్వారా ప్రజలకు డబ్బు, సమయాన్ని అదా అయ్యింది.  గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు కలిసి ఈ క్రమంలో 93, 57, 707 సర్టిఫికెట్స్ మంజూరు చేశారు. దాదాపు 5.3 కోట్ల మందికి చేరువ అయ్యేలా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 1,46,27,905 కుటుంబాలను కలిసి దాదాపు 11 రకాల సర్టిఫికెట్స్ , ఇంకా రేషన్ కార్డు లో మార్పులు, చేర్పులు వంటివి చేపట్టి అక్కడికక్కడే మంజూరు చేశారు . 

ఐదేళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవంటే.. 

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఇలా సర్టిఫికెట్స్ సులువుగా వస్తున్నాయి కానీ ఐదేళ్ల క్రితమైతే విద్యార్థులకు ఈ సర్టిఫికెట్స్ తీసుకోవడం ఒక పెద్ద ప్రయాస అయ్యేది. విద్య సంవత్సరం ప్రారంభంలో పిల్లలు పలు కాలేజీలు, యూనివర్సిటీలు . హాష్టల్లు వంటి చోట చేరడం  , రిజర్వేషన్ కోటాలో ఇంజినీరింగ్ , మెడిసిన్, ఇంకా ఫార్మసీ, ఎంబీఏ వంటి పెద్ద కోర్సుల్లో చేరడం కూడా ఈ రెండు మూడు నెలల్లోనే ఉంటుంది. కాబట్టి లక్షలాది మంది విద్యార్థులు ఆయా మండల కార్యాలయాలకు వెళ్లి లేదా ఈసేవలో దరఖాస్తు చేసుకుని అవి మళ్ళీ వచ్చేవరకూ ఎదురుచూస్తుండేవారు. కొన్నిసార్లు మండల, రెవెన్యూ అధికారులు ఇతర పనుల్లో అంటే సర్వే పనులు, ఉన్నతాధికారులు, మంత్రుల టూర్లలో బిజీగా ఉంటే విద్యార్థులకు ఎదురుచూపులే ఉండేవి. సర్టిఫికెట్ ఉంటే రిజర్వేషన్ కోటాలో సీటు, హాస్టల్ వంటివి వస్తాయి. అవి సరైన రోజుకు సమర్పించకపోతే సీటు పోతుంది. ఒకేసారి వందలాది సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా మండల స్థాయి అధికారులకు కష్టమే అయ్యేది. ఇప్పుడు ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులకు వెనువెంటనే సర్టిఫికెట్స్ ఇచ్చి వారికి పనులు సులభతరం చేశారు. జగన్ చేపట్టిన ఈ కార్యక్రమంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024