Ntv No.1 Channel: తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ ఛానెల్‌గా తిరుగులేని సత్తాను చాటుతోన్నఎన్టీవీ..

Ntv No.1 Channel: ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ ఛానెల్‌గా తిరుగులేని సత్తాను చాటుతోంది. 24×7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా, నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ.. ఊకదంపుడు ఉపన్యాసాలకు విరుగుడుగా మంచి కంటెంట్‌తో మరోసారి దూసుకుపోయింది. ఛానెల్ మొద‌లు పెట్టిన నాటి నుంచే ప్రేక్షకుల ఆద‌ర‌ణ పొందుతూ వ‌చ్చింది.

గ్రామం నుంచి ప‌ట్టణం వ‌ర‌కు ఖ‌చ్చిత‌మైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంత‌గా ప్రజాద‌ర‌ణ పొందింది. బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పుడూ లైవ్‌లో ఉండి రిపోర్ట్ చేయ‌డం, ఖ‌చ్చిత‌మైన స‌ర్వేల‌కు ఎన్టీవీ పెట్టింది పేరు. వార్తలంటే కేవ‌లం త‌ప్పుడు ప్రచారాలు, అన‌వ‌స‌ర‌మైన సంచ‌నాలు కాదు, నిజాన్ని ధైర్యంగా చెప్పగ‌ల‌గ‌డం, ప్రజ‌లకు అవ‌స‌ర‌మైన విష‌యాల్ని వారి దగ్గర‌కు చేర్చడ‌మే అని న‌మ్మిన ఎన్టీవీకి ప్రజ‌లు నెం.1 స్థానాన్ని క‌ట్టబెట్టారు.

Advertisement

తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ 66.5 టీఆర్పీల‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ”ప్రతి క్షణం-ప్రజా హితం” అనే స్లోగ‌న్‌ను పెట్టుకుని, కేవ‌లం దాన్ని స్లోగ‌న్‌గా వ‌దిలేయ‌కుండా ప్రతిక్షణం ఆ మాట‌ మీద ఉండ‌ట‌మే ఎన్టీవీ ఈ స్థానానికి రావ‌డానికి కార‌ణం. దేనికీ బెద‌ర‌కుండా, ఎవ‌ర్నీ బెదిరించ‌కుండా ప్రజ‌ల పక్షాన నిల‌బ‌డుతుండ‌ట‌మే ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో మేటిగా నిల‌బెడుతుంది. కాగా, ఎన్టీవీ నెం.1గా నిల‌వ‌డంతో ఎన్టీవీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Sootiga Team

Recent Posts

సుహాస్ ‘ప్రసన్నవదనం’ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట..

చిన్ని సినిమాలు చేస్తూ పెద్ద పెద్ద హిట్స్ కొడుతున్నడు హీరో సుహాస్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌ వంటి బ్లాక్‌బ‌స్టర్ హిట్…

May 4, 2024

గీతా మాధురి, ఆషులకు వచ్చిన సమస్యేంటి? ఇద్దరూ ఏక కాలంలో ఒకటే పోస్ట్..

సూపర్ సింగర్ నుంచి తన టాలెంట్‌తో స్టార్ సింగర్‌గా మారింది గీతా మాధురి. ఎన్నో సినిమాల్లో అదిరిపోయే హిట్ సాంగ్స్‌తో…

May 4, 2024

సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న మహేష్ బాబు, విజయ్ ఫ్యాన్స్ వార్

ఇళయ దళపతి విజయ్.. కోలీవుడ్‌ స్టార్ హీరో. అక్కడ ఆయనకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతుంటారు. ఆయన సినిమాలకు సక్సెస్ రేట్…

May 4, 2024

జగన్ దెబ్బకు.. కూటమి అబ్బా…

తొలుత టీడీపీ, జనసేనలు.. సూపర్ సిక్స్ పేరిట ఓ మినీ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకొచ్చాయి. ఆ తరువాత చాలా గ్యాప్…

May 3, 2024

నవదీప్ పై పంఖురి గిద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ వెండితెరపై కనిపించక చాలా కాలం అవుతోంది. త్వరలోనే లవ్ మౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు…

May 3, 2024

ఆ బాధల నుంచి గట్టెక్కించే వీరుడిగా వీరమల్లు.. టీజర్ ఏం చెబుతోందంటే..

ఊరించి ఊరించి ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో పవన్‌ను అయితే…

May 3, 2024