రాజకీయ నాయకుడికి మాటే అందం.. అదే అందలమెక్కిస్తుంది.. అదే పాతాళానికి తొక్కేస్తుంది. ఈ రెండో కోవకు చెందినవారే జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయనకు తొలిసారిగా మాట విలువ తెలిసొచ్చినట్టుంది. వ్యక్తుల మీద కామెంట్లు రాజకీయాల్లో ఒక స్థాయి వరకూ ఓకే కానీ వ్యవస్థల జోలికి వెళ్లకూడదు. కానీ ఆయన వ్యవస్థలపై నోరు పారేసుకుని తదనంతర పరిణామాలను చవిచూశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షలమంది సైన్యంతో బలమైనదిగా ఉన్న వలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ వారిని హ్యూమన్ ట్రాఫికర్స్ అంటూ ఆవమానకరంగా మాట్లాడినందుకు పవన్ గట్టి మూల్యమే చెల్లించుకున్నారు. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అని ఆయన కామెంట్ చేశారు. వ్యవస్థపై ఆయన చేసిన కామెంట్‌తో ఆయన స్థాయి పాతాళానికి పడిపోయింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వలంటీర్లు, వారి కుటుంబీకులు సైతం పవన్ నోటి దురదను గట్టిగా వ్యతిరేకిస్తూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం వంటి నిరసనలతో రాష్ట్రాన్ని హోరెత్తించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు సైతం చేశారు. మొత్తం పది లక్షలమందితో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవస్థతో పవన్ కోరి కొరివితో తలగోక్కున్నట్లు అయింది.
జనసేన నేతలు సైతం విమర్శలు..
రాష్ట్రంలో కోవిడ్‌తో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వలంటీర్ల సేవలు నిరుపమానం. కోవిడ్ మృతులను చూసేందుకు సైతం బంధుమిత్రులు.. ఆఖరుకు.. కన్నవాళ్ళు… కట్టుకునేవాళ్ళు రాలేక భయంగా ఉన్న రోజుల్లోపు వారి శవాలను తీసుకెళ్లి కర్మకాండలు జరిపించిన సేవకులు వాలంటీర్లు. గోదావరి జిల్లాల్లో వరదలు మునిగిపోయి బిక్కుబిక్కుమంటున్న వారికి పీకల్లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి సరుకులు ఇచ్చి మీకు మేమున్నాం అని భరోసా ఇచ్చిన సొంత మనుషులు వలంటీర్లు.. అలాంటి వారిపై కామెంట్ చేసి పవన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని జనసేన నేతలు సైతం విమర్శిస్తున్నారు. గ్రామాల్లో వృద్ధులు.. బాలింతలు.. ఇతర అభాగ్యులకు సొంత మనుషుల్లా సేవలు అందించే ఓ పెద్ద వ్యవస్థను కావాలని తనకు వ్యతిరేకంగా మార్చుకున్న పవన్ ఇప్పుడు తన మాటలకు క్షమాపణ చెప్పలేక, కొత్త భాష్యం అందుకున్నారు.
వారి మనోభావాలు దెబ్బతినవా ?
వలంటీర్లు అందరూ కాకున్నా కొందరు చెడ్డవాళ్లున్నారు అని మెలిక తిప్పారు కానీ తాను విస్తృతంగా పర్యటిస్తున్న గోదావరి జిల్లాలో అయన సామాజికవర్గానికి చెందిన కాపు యువతలో ఎంతోమంది వాలంటీర్లుగా ఉన్నారు. మరి ఈయన నోటిదురుసు ప్రకటనతో వారి మనోభావాలు దెబ్బతినవా ? ఏమిటో ఈ బుర్రతక్కువ మాటలు. పదిహేనేళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ ఏది మాట్లాడాలో.. ఏది ఆడకూడదో తెలియని ఇలాంటి నాయకుణ్ణి నమ్ముకుని వెళ్తే కుక్క తోకపట్టుకుని గోదారి ఈదినట్లే అని కార్యకర్తలు అంటున్నారు. ప్రజామన్ననలు అందుకున్న వలంటీర్ వ్యవస్థమీద విమర్శలు చేయడం అంటే తన సమాధి తానే తవ్వుకున్నటు అని పార్టీలోని నాయకులూ, సానుభూతిపరులు సైతం అంటున్నారు. పవన్ ఏదోనాటికి నాయకుడు అవుతాడు అనుకుంటే ఇలా పరువుతీసుకుని నేలబారు మనిషి అయిపోతాడని అనుకోలేదని మరికొందరు విమర్శిసున్నారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…