ఏపీకి వచ్చి రాజకీయాలు మాట్లాడితే కచ్చితంగా అధికార పార్టీ వైసీపీ టార్గెట్ చేస్తుందని ముందుగానే సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఊహించారా..? అందుకే ముందుగానే ప్రసంగంలో కూడా ఒక మాట ఆయన అనేశారా..? టార్గెట్ చేస్తారని బహుశా ఊహించినా ఈ రేంజ్‌లో ఉంటుందని తలైవా కలలో కూడా అనుకోని ఉండరేమో. ఇంతకీ ఎన్టీఆర్(NTR) శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ తలైవా అన్న ఆ మాటలకు అర్థమేంటి..? ముందుగానే ఆయన నోటి నుంచి ఆ మాట ఎందుకొచ్చింది..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఇంత అక్కస్సా..!
ఎన్టీఆర్(NTR) శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడ విచ్చేశారు. ఆయన పాటికి ఆయన.. అటు ఎన్టీఆర్ గురించి, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu Naidu) గురించి నాలుగు మాటలు మాట్లాడేసి ఉంటే బాగుండేదేమో. కానీ చంద్రబాబు విజన్, రానున్న ఎన్నికల్లో బాబే రావాలి అని రజనీ అనేసరికి వైసీపీ(YSRCP) బ్యాచ్‌కు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక ఇదే ఆలస్యమని వైసీపీ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆయన్ను ఏకిపారేసింది. ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాటలు ఆఖరికి బూతులు కూడా తిట్టిపోసింది జగన్ అభిమానగణం. అంతేకాదు.. రజనీ(Rajinikanth) గతాన్ని జేసీబీలతో తవ్విమరీ విమర్శలు గుప్పించింది. మరోవైపు.. విజయవాడ నుంచి సరిగ్గా తలైవా చెన్నైకి కూడా వెళ్లారో లేదో కానీ ఇక వైసీపీ నేతలు మీడియా గొట్టాల ముందు వాలిపోయారు. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. మంత్రులు జోగి రమేష్, రోజా, గుడివాడ అమర్నాథ్ ఇలా ఒక్కరా ఇద్దరూ లెక్కలేనంత మంది మీడియా ముందుకు వచ్చేసి.. అసలు వాళ్లు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంతగా తిట్టిపోసేశారు. కొడాలి నాని అయితే ఆయన ఆరోగ్యం, ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడటం ఎంత దారుణం. అయినా వైసీపీని ఏదో వ్యక్తిగతంగా విమర్శించినట్లు ఆ పార్టీ నేతలు ఎందుకింతలా అక్కస్సు వెళ్లగక్కుతున్నారో వాళ్లకే తెలియాలి.
ఈ కొత్త కథేంటో..!
ఇవన్నీ చాలవన్నట్లుగా దివంగత నటి సిల్క్‌స్మిత మరణానికి కారణం రజనీకాంతే(Rajinikanth) అన్నట్లుగా లేనిది ఉన్నట్లుగా వైసీపీ బ్యాచ్ ప్రచారం చేయడం గమనార్హం. అంతేకాదు.. ఆమె చివరి లేఖను కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి సిల్క్ స్మితను కడసారి చూడటానికి ఎవర్నీ పోవద్దని సూపర్ స్టారే ఆదేశించారని కూడా ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటు. ఇలా ఒకటారెండా రజనీకాంత్(Rajinikanth) గతాన్ని వైస్రాయ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి దాకా వైసీపీ తవ్విపడేస్తోంది. అయితే.. ఇందుకు స్ట్రాంగ్ కౌంటర్లే రజనీ ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయి. 32 కేసులున్న వైఎస్ జగన్‌కు.. 32 రాష్ట్రాల్లో అభిమానులున్న తలైవాకు పోలికేంటి..? నానా వైసీపీ పందులే గుంపుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా వస్తుందని దిమ్మతిరిగేలా కౌంటర్లు పేలుతున్నాయి.
తలైవా(Rajinikanth) ముందే తలిచారా..!?
రాజకీయంగా మాట్లాడితే పరిస్థితి ఇలా ఉంటుందని రజనీ(Rajinikanth) ముందే ఊహించారని విశ్వసనీయవర్గాల సమాచారం. అందుకే ‘వద్దురా.. రజనీ అని మనసు చెబుతోందనడం అందులో భాగమేనా’ అని శతజయంతి ఉత్సవాల్లో ఆయన అన్నారట. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. ముందుగానే ఊహించి మరీ ఇలా అన్నారంటే.. ఒకవేళ పనిగట్టుకుని మాట్లాడాల్సి వస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో మరి. ఎవరెన్ని విమర్శలు చేసినా రజనీకాంత్(Rajinikanth) ఒక్కమాట కూడా తిరిగి అనలేదు.. ఇదీ తలైవా నైజం అంటే అని ఆయన వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. మరోవైపు టీడీపీ సైతం ఎన్ని విమర్శలు చేసినా రజనీకి పోయేదేం లేదు .. వైసీపీ అసలు నైజం బయటపడిందని టీడీపీ అంటోంది. అయితే అనాల్సినవన్నీ అనేసి.. ప్రజలు మోసపోకూడదన్నదే తమ ఉద్దేశ్యం అని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి చూస్తే ఇవాళ్టితో రజనీ(Rajinikanth) ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు మీడియా ముందుకు రచ్చ చేయడం మామూలైపోయింది.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…