ఒక్క ఏపీని పక్కనబెట్టి పొరుగు రాష్ట్రం ఏదైనా చూడండి.. ఏ పనికైనా అవస్థలు.. గంటల కొద్దీ క్యూలైన్లు.. అబ్బో ఒక పని అవ్వాలంటే విసిగి వేసారితే కానీ అవదు. కానీ ఏపీలో సీన్ రివర్స్. ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలన్నీ వచ్చి చేరుతాయి. పొరుగు రాష్ట్రంలో మాదిరిగా ఏపీలో ఏ ప్రభుత్వ సేవ లేదంటే సాయం కావాలంటే పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండవు.. గంటలకొద్దీ నిలబడాల్సిన దుస్థితి ఉండదు.. చదువుకోలేదు కాబట్టి అప్లికేషన్ నింపేందుకు వ్యక్తులను వెదుక్కవోడం ఉండదు. సంబంధిత పాత్రాలన్నీ వెదుక్కుని సంబంధిత కార్యాలయాలకు పరుగులు తీయడం ఉండదు. అంతా చేశాక.. నాయకులతో చెప్పించుకోవడమూ ఉండదు.. అధికారి చేయి తడపడమూ ఉండదు. కులం, ఇన్‌కమ్, నివాసం, బర్త్, డెత్ సర్టిఫికెట్ ఏదైనా సరే ప్రజల ఇంటి వద్దకే వచ్చి చేరుతుంది.
ఇతర రాష్ట్రాల్లో గంటలకొద్దీ క్యూ లైన్లలో ..
అనేక రాష్ట్రాల్లో ఏ పథకం, సాయం కావాలన్నా కిలోమీటర్ల కొద్దీ క్యూలైనల్లో గంటల కొద్దీ నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది . దరఖాస్తు చేసుకోవాలంటే సరైన విధానం తెలియక దళారులకు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. తీరా ఇంత చేశాక ఆ పథకం అందడం కోసం మళ్లీ తమకు తెలిసిన చోటా మోటా నాయకులు చేత రికమైండేషన్ చేయించాలి. ఇంత చేసినా ఆ పథకం అర్హుల జాబితాలో పేరు ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
నాణ్యత, పారదర్శకతకు జై కొడుతున్న జనం..
ఏపీ సీఎం జగన్ ఘనత ఇది. ప్రభుత్వ పాలనలో నాణ్యత, పారదర్శకతకు ప్రజలు జై కొడుతున్నారు. జగనన్న పాలనకు అద్భుతమైన ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి కొందరు వలంటీర్లను నియమించి ఎలాంటి సాయమైనా సరే జనాలకు క్షణాల్లో అందేలా చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు నానా తిప్పలు పడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పెన్షన్లన్నీ తెల్లవారే సరికి వారి గుమ్మం ముందే వలంటీర్లు ఉంచేస్తారు. జనాలకు సంక్షేమాన్ని సైతం చాలా దగ్గర చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. సంక్షేమ పథకం ఏదైనా సరే.. సిఫార్సులతో పని లేకుండా నేరుగా లబ్ధిదారులకు వెళ్లి చేరుతాయి. దీనికి సచివాలయ సిబ్బంది, వలంటీర్లదే బాధ్యత. అర్హత ఉంటే చాలు.. వారికి ఆ పథకం చేరువయ్యేలా జగన్ ప్లాన్ చేశారు.
ప్రజల గుమ్మం ముందుకే వందలాది సేవలు..
ఏ పథకంలోనూ రూపాయి అవినీతి లేదు.. ఎవరి కరుణా కటాక్షాలు అక్కర్లేదు.. పెద్దవాళ్ళతో చెప్పించాల్సిన పనిలేకుండా అమలు చేస్తున్నారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు.. పెన్షన్లు, సర్టిఫికెట్లు.. నివాస, మరణ… జనన ధ్రువీకరణ పత్రాలు.. ఒకటేమిటి ప్రభుత్వం నుంచి అందే వందలాది సేవలు ప్రజల గుమ్మం ముందు వాలుతున్నాయి. ఇంత చక్కగా ప్రతి ఒక్క పథకం అమలవుతోంది కాబట్టే ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆంధ్రాకు వచ్చి మరీ ఇక్కడి సంస్కరణల గురించి తెలుసుకుని అవాక్కవుతున్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఆయా పథకాల అమలు కోసం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తానికి ప్రజారంజక పాలనతో ఏపీ సీఎం జగన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…