ఏపీలో 15 ఏళ్లు పైబడిన యువతను క్రీడల దిశగా ప్రోత్సహించి తద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో భాగంగా క్రీడల ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ పేరిట వివిధ క్రీడలను నిర్వహిస్తోంది. గ్రామీణ, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీ వరకూ క్రికెట్, వాలీబాల్, బాడ్మింటన్, కబడ్డీ, ఖో-ఖో, పోటీ లేని క్రీడలను నిర్వహిస్తున్నారు.
51 రోజుల పాటు 680 మండలాల్లో 175 నియోజకవర్డాల్లో, 26 జిల్లాల్లో, రాష్ట్రాస్థాయిలో 350 మ్యాచ్‌లు మొత్తంగా అన్నింటా కలిపి 2.99 లక్షల మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. గ్రామ స్థాయిలో గెలిచిన జట్టు మండలం.. ఆపై నిజయోజవర్గా.. ఆ తరువాత జిల్లా.. ఆపై రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతుంది. ఈ పోటీలలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, ట్రోఫీలు, పతకాలను ప్రభుత్వం అందజేస్తుంది. ఇక నియోజకవర్గ స్థాయి నుంచి నగదు బహుమతులను అందజేయడం జరుగుతుంది. ఇక ఈ పోటీల నిర్వహణలో భాగంగా 5 ఆటలకు గానూ కావల్సిన సామాగ్రినంతా ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది.
పోటీల నిర్వహణకు గ్రౌండ్స్, స్టేడియాలు సిద్ధం చేయడం వంటివి వలంటీర్స్‌కు అప్పగించడం జరిగింది. వారికి వివిధ పోటీల నియమ నిబంధనలపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు. పీఈటీ, పీడీలతో పాటు శాప్ అధికారులతో 5 పోటీలకు సంబంధించిన నియమ నిబంధనలు, శిక్షణ, ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల నిర్వహణపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక క్రీడాకారుల రిజిస్ట్రేషన్ నేటి నుంచే ప్రారంభమైందని శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎంఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
రిజిస్ట్రేషన్ కోసం ఏం చేయాలంటే..
15 సంవత్సరాలు పైబడిన స్రీ, పురుషులెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
సమీపంలోని సచివాలయంలో నమోదు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ aadudamandhra.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అలాగే రిజిస్ట్రేషన్ కోసం 1902 నంబర్‌కి కాల్ చేయవచ్చు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…