ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? కూటమి గెలిచి టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అవుతారా..? లేకుంటే మళ్ళీ వైసీపీనే గెలిచి సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటిన్యూ అవుతారా..? అనేది జూన్ నాలుగో తేదీన తేలిపోనుంది. ఈ లోపే ఎవరి గెలుపు ధీమాలో వారున్నారు. వైసీపీ విశాఖలోనే ప్రమాణ స్వీకారం అని డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చేస్తుంటే.. మేమేం తక్కువ కాదని టీడీపీ కూడా అమరావతి వేదికగా చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారని చెబుతోంది.
అయ్యేపనేనా బాబూ..!
దేశం మొత్తం మనవైపు చూసేలా ఫలితాలు ఉంటాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వయాన చెప్పడంతో ఇక పార్టీ శ్రేణులు ఎగిరి గంతులు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాయ్. మూడో కంటికి తెలియకుండా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నీ చూసుకుంటున్నారని ఇటీవలే విశాఖకు వెళ్లి రావడంతో సీన్ అర్థం అయ్యింది. మరోవైపు మంత్రులు వీళ్ళే అని ఒక జాబితా కూడా వైరల్ అవుతోంది. దీనికి తోడు రోజుకొకరు మీడియా ముందుకు వచ్చి వైసీపీ గెలుస్తోంది.. ఇన్ని సీట్లు వస్తాయి అని ధీమాగా చెబుతున్నారు. దీంతో కూటమి నుంచి కనీసం సౌండ్ రావట్లేదు.
బాబూ కుప్పం కథేంటి..?
పనిలో పనిగా సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు చేసిన శపథం కూడా వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఎలాగో ఈ జన్మకు నెరవేరదని టీడీపీ శ్రేణులకు కూడా క్లారిటీ వచ్చేసినట్టుందని వైసీపీ వీరాభిమానులు సేటైర్లు పేలుస్తున్న పరిస్థితి. అంతే కాదు ఇంకో అడుగు ముందుకేసి.. రాష్ట్రం సంగతి దేవుడెరుగు.. కనీసం కుప్పంలోనే చంద్రబాబుకి దిమ్మ తిరిగే షాక్ తగలబోతుంది అని పబ్లిక్ టాక్..!? అంటూ వైసీపీ నేతలు పదే పదే చెబుతుంటే చంద్రబాబుకే డౌట్ వస్తోందట. ఎందుకంటే బాబు చిరకాల ప్రత్యర్థి, చిత్తూరు జిల్లా పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు, ఇన్నాళ్లు బాబాను గెలిపించిన దొంగ ఓట్లు సుమారు 40 వేలకు పైగా తొలగించడం, భరత్ ను గెలిపించి అసెంబ్లీకి పంపితే మంత్రిని చేస్తానని జగన్ మాట ఇవ్వడంతో ఈసారి కుప్పం ప్రజలు మార్పు కోరుకున్నారు అన్నది టాక్.
ఏమో కుప్పంలో వైసీపీ జెండా ఎగరావచ్చు!
వాస్తవానికి వైసీపీ దెబ్బతో ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందు నుంచే కనీసం నెలలో రెండు మూడు సార్లు కుప్పం వెళ్లొచ్చేవారు చంద్రబాబు, ఆయన సతీమణి నారా భవనేశ్వరి. అప్పుడే సీన్ అందరికీ అర్థమై పోయింది. దీంతో వైసీపీ మరింత జోరు పెంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పం కంచుకోటను కొట్టాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు పెద్దిరెడ్డి, జగన్. ఎన్నికల తర్వాత బాబు ఒడిపోతున్నాడు.. ఓడిపోతున్నాడు అని వైసీపీ నేతలు చెబుతూ ఉండటంతో ఏం జరుగుతుందో ఏమో అని కూటమి నుంచి కనీసం స్పందన లేదంటే ఓటమిని కూటమి ఒప్పుకున్నదని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇందులో ఎలాంటి సందేహాలు.. అనుమానాలు.. మీ మదిలో మెదులుతున్న ప్రశ్నలకు జూన్ నాలుగో తేదీన సమాధానాలు రాబోతున్నాయి.. అప్పటి వరకు కాస్త ఓపిక, సహనంతో ఉండాల్సిందే మరి.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…