‘ఎద్దులా ఎదిగావ్.. ఇంతవరకూ బుద్ధి రాలేదు.. ఇకముందు వస్తుందో రాదో తెలీదు… ఇది బద్రి సినిమాలో బ్రహ్మానందంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పలికిన డైలాగ్. ఇప్పుడు అదే డైలాగ్ చెప్పి వైసీపీ నాయకులు జనసేన అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తున్నారు. వారాహి యాత్రలో ఉన్న పవన్.. వారానికోసారి బ్రేక్ ఇస్తుంటాడని.. ఆ సమయంలో ఏం స్టెరాయిడ్స్ లేదంటే మందులు వాడతారో కానీ హుషార్ తెచ్చుకుని.. ఒంటిమీద సోయి మరిచి మాట్లాడుతుంటారని పేర్కొన్నారు. అసలు తాను అనే మాటలకు ఆధారం కానీ.. రుజువులు కానీ లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటంలో పవన్ కల్యాణ్ ఒక బ్రాండ్‌గా మారిపోయారని విమర్శిస్తున్నారు.
బుర్రలో బుద్ధి ఉందో .. ఆవుపేడ ఉందో అర్థం కావడం లేదు..
కొవిడ్ సమయంలో వలంటీర్ల సేవలు నిరుపమానం.. ఇంటింటికి తిరగడం.. కొవిడ్ రోగులను గుర్తించడం.. మందులు అందించి వారికి వలంటీర్లు ప్రాణభిక్ష పెట్టారు. అందుకే కేరళ… ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్ర మోడల్‌ను గుర్తించి తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశాయి. ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి పొద్దు పొడవక ముందే సంక్షేమ పథకాలు గుమ్మం ముందే అందించే సంక్షేమ సారథులుగా వలంటీర్లు మారారు. అలాంటి వారిని ఇంటింటికి వెళ్లి అమ్మాయిలు, వితంతువుల లెక్కలు తీసి వేరేవాళ్లకు పంపిస్తే వాళ్లొచ్చి వీళ్ళను ట్రాప్ చేసుకుని ఎత్తుకెళ్లిపోతున్నారని పవన్ అన్నారని.. ఆయనకు బుర్రలో బుద్ధి ఉందో .. ఆవుపేడ ఉందో అర్థం కావడం లేదంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మీరు చదివిన రెండు లక్షల పుస్తకాల్లో ఎక్కడా.. సభ్యత, సంస్కారం గురించి ఒక్క లైన్ కూడా లేదేమో.. అందుకే వాలంటీర్లతో 70 శాతం మంది మహిళలే ఉన్నప్పటికీ వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడావని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో మృతుల కడసారి చూపులకు సైతం బంధుమిత్రులకు రాని కష్టకాలంలో ఆ మృతులకు అన్నీ తామే అయ్యి అంత్యక్రియలు చేసిన వలంటీర్ల సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని.. కానీ పవన్ కళ్ళకు అవేవీ కానరావడం లేదని విమర్శిస్తున్నారు.
మీ లాంటి పార్ట్ టైం గాళ్ళను ఎక్కడ పెట్టాలో జనానికి బాగా తెలుసు..
వలంటీర్లను కూలీలు, గోనెసంచుల మోసేవాళ్ళంటూ హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పటికే బుద్ధితెచ్చుకుని తమ ప్రభుత్వం వచ్చినా వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారన్నారు. ‘ముసలోడైన చంద్రబాబుకు.. నీ తోడు లోకేష్‌కు సైతం ఉన్నపాటి సోయి నీకు లేకపోవడం దారుణం ప్యాకేజి స్టార్’ అంటూ వైసీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో కాపురం ఉంటూ.. ఆఫ్ కోర్స్ మీకు పెళ్ళాం లేదు కానీ.. అక్కడే నివాసం ఉంటూ అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుని ఆంధ్ర రావడం.. విజయవంతంగా నడుస్తున్న వ్యవస్థల మీద దుమ్మెత్తిపోయడం… మళ్ళీ షూటింగులకు వెళ్లిపోవడం.. ఇదే మీ దినచర్య అని పవన్‌ను ఘాటుగా విమర్శించారు. మీ లాంటి పార్ట్ టైం గాళ్ళను ఎక్కడ పెట్టాలో జనానికి బాగా తెలుసని.. అందుకే రెండుచోట్లా ఓడగొట్టి మూల కూర్చోబెట్టారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయినా బుద్ధిరాలేదని.. వస్తుందో లేదో తెలీదన్నారు. నువ్వు చేసే స్టేట్మెంట్లకు మళ్ళీ కేంద్ర ఇంటలిజెన్స్ పేరు ఎందుకు చెప్పు ? అంటూ నిలదీస్తున్నారు కేంద్ర సంస్థలు ఒక్కోసారి రాష్ట్రాలకు సైట్ తెలియకుండా ఆపరేషన్స్ చేస్తాయని… అవి కేంద్రానికి మాత్రమే బాధ్యత వహిస్తాయని.. అలాంటిది వార్డ్ మెంబర్ కూడా కానీ పవన్‌కు ఎందుకు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు గోదావరి జిల్లాల్లో ఇష్టానుసారం మాట్లాడి ప్యాకేజి ఎక్కువ బేరం తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లున్నారని.. కానీ అది జరగదని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. మళ్ళీ ఎక్కడ పోటీ చేసినా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయంటున్నారు. మీకు డబ్బులు కావాలంటే చంద్రబాబు దగ్గర బేరం చేసుకోవాలని.. లేదు దెబ్బలే కావాలంటే లక్షలాదిమంది సైన్యం లాంటి వలంటీర్లతో పెట్టుకోవాలంటుననారు. ఇక మీకు వెనకాముందూ ఉండదని.. ఇత్తడే ఇత్తడని వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పవన్‌కు వార్నింగ్‌లు ఇస్తున్నారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…