Categories: వార్తలు

నివ్వెరపరుస్తున్న ఏపీ విద్యార్థులు.. లక్షల్లో టోఫెల్‌కు..

జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీ విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు వాటిలోని విద్యాబోధన తీరుతెన్నులను సైతం పూర్తిగా మార్చేశారు. దీంతో పేద విద్యార్థులు సైతం నాణ్యమైన చదువులను అభ్యసించగలుగుతున్నారు. నాడు – నేడు పేరిట జగన్ ప్రభుత్వం ఏపీలోని పాఠశాలలన్నింటినీ ఆధునికీకరించింది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టింది. తద్వారా నిరుపేద విద్యార్థులకు టోఫెల్ శిక్షణను సైం అందిస్తూ వారిని అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు.

గతంలో ఎందరో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ వేదికనే కాకుండా ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ పాల్గొని తమ ప్రతిభ చాటారు. ప్రస్తుతం ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పరీక్ష అయిన టోఫెల్‌కు హాజరయ్యారు. వెయ్యి మందో.. రెండు వేల మంది పిల్లలో కాదు.. ఏకంగా ఏపీ నుంచి నాలుగున్నర లక్షల మందికి పైగా చిన్నారులు ఈ పరీక్షలు హాజరై తమ ప్రతిభను చూపించారు. దాదాపు 13,104 స్కూళ్లలో 3,4,5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరవడం విశేషం.

Advertisement

ఇక టోఫెల్ తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 6,7,8,9 తరగతులు చదువుతున్న 5907 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరు కానుండటం మరో విశేషం. ఈ పరీక్ష ఏప్రిల్ 12న జరగనుంది. దీనికి 16.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పరీక్షలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపరిచిన విద్యాబోధన, ఆంగ్లంపై పట్టు కోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాఖాఖ పేర్కొంది.

Advertisement
Sootiga Team

Recent Posts

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…

May 13, 2024

నాగబాబు ఆరోపణలకు గట్టిగా ఇచ్చిపడేసిన ఎన్నికల కమిషన్!

జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…

May 12, 2024