నివ్వెరపరుస్తున్న ఏపీ విద్యార్థులు.. లక్షల్లో టోఫెల్‌కు..

Students In Ap

జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీ విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు వాటిలోని విద్యాబోధన తీరుతెన్నులను సైతం పూర్తిగా మార్చేశారు. దీంతో పేద విద్యార్థులు సైతం నాణ్యమైన చదువులను అభ్యసించగలుగుతున్నారు. నాడు – నేడు పేరిట జగన్ ప్రభుత్వం ఏపీలోని పాఠశాలలన్నింటినీ ఆధునికీకరించింది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టింది. తద్వారా నిరుపేద విద్యార్థులకు టోఫెల్ శిక్షణను సైం అందిస్తూ వారిని అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు.

గతంలో ఎందరో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ వేదికనే కాకుండా ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ పాల్గొని తమ ప్రతిభ చాటారు. ప్రస్తుతం ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పరీక్ష అయిన టోఫెల్‌కు హాజరయ్యారు. వెయ్యి మందో.. రెండు వేల మంది పిల్లలో కాదు.. ఏకంగా ఏపీ నుంచి నాలుగున్నర లక్షల మందికి పైగా చిన్నారులు ఈ పరీక్షలు హాజరై తమ ప్రతిభను చూపించారు. దాదాపు 13,104 స్కూళ్లలో 3,4,5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరవడం విశేషం.

నివ్వెరపరుస్తున్న ఏపీ విద్యార్థులు.. లక్షల్లో టోఫెల్‌కు..

ఇక టోఫెల్ తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 6,7,8,9 తరగతులు చదువుతున్న 5907 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరు కానుండటం మరో విశేషం. ఈ పరీక్ష ఏప్రిల్ 12న జరగనుంది. దీనికి 16.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పరీక్షలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపరిచిన విద్యాబోధన, ఆంగ్లంపై పట్టు కోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాఖాఖ పేర్కొంది.

Google News