ఆ పేర్లతో పథకాలను స్వాగతీస్తున్నా: పవన్ కళ్యాణ్
సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పథకాలకు తన పేరు పెట్టుకునేవారు. ఆ దుస్సాంప్రదాయాన్ని బ్రేక్ వేసింది తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.
మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
తాజాగా మూడు పథకాలకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం గారి పేర్లతో వాటిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. దాంతో ముఖ్యమంత్రికి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్
“గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి – విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామం. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో అమలు చేయడం సముచితం. మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ గారి పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం గారి పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది,” అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ .