కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి దాడి

కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి దాడి

విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన ఏపీలో కలకలం సృష్టిస్తోంది..

తెలిసిన సమాచారం ప్రకారం… స్వామిదాస్ అనే కానిస్టేబుల్ గూడూరులోని సాధుపేట సర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నట్టుండి ఓ వ్యక్తి పెద్ద వెదురు కర్రతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన చోసిన అప్రమత్తమైన మరో కానిస్టేబుల్ వచ్చి ఆ వ్యక్తిని ఆప్ ప్రయత్నం చేసారు.

అప్పటికే కానిస్టేబుల్ స్వామీదాస్ తలకు బలమైన గాయం కావటం అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

అసలు ఆ వ్యక్తి కానిస్టేబుల్ పై ఎందుకు దాడి చేసాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీన్ని చూసిన వారంతా.. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకపోతే, మరి సామాన్య ప్రజానీకం సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.

Google News