అది ఫేక్ అంటున్న అన్నపూర్ణ

Annapurna

ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో సినిమా కోసం బుచ్చిబాబు చాలా ఆడిషన్స్ చేశాడు. సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తిచేశాడు.

ఇక విజయ్ దేవరకొండకు సంబంధించి 2 సినిమాల నుంచి కాస్టింగ్ కాల్స్ ఇచ్చారు. త్వరలోనే రవికిరణ్ కోలా దర్శకత్వంలో, రాహుల్ సంకృత్యాన్ తో సినిమాలు చేయబోతున్నాడు విజయ్. ఈ రెండు సినిమాలకు కాస్టింగ్ కాల్స్ వచ్చాయి. ఆడిషన్స్ కూడా నడిచాయి.

ఇప్పుడీ ముసుగులో ఫేక్ కాస్టింగ్ కాల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. అన్నపూర్ణ స్టుడియోస్ లో ఓ న్యూ ఏజ్ సినిమా వస్తోందని, దానికి హీరోహీరోయిన్లు కావాలంటూ ఓ ప్రకటన సోషల్ మీడియాలో పుట్టుకొచ్చింది. హీరోహీరోయిన్లతో పాటు.. ఫ్రెండ్, సిస్టర్ క్యారెక్టర్స్ కూడా కావాలంటూ ఓ మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు

దాదాపు వారం రోజులుగా నడుస్తున్న ఈ నకిలీ కాస్టింగ్ కాల్ మేటర్ ఆలస్యంగా అన్నపూర్ణ స్టుడియోస్ కు తెలిసింది. వెంటనే స్టుడియో రియాక్ట్ అయింది. ఇలాంటి ఫేక్ ప్రకటనల్ని నమ్మొద్దని పిలుపునిచ్చింది. 

Google News