అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ ఈ సమావేశాలను వాకౌట్ చేసింది. ఏపీలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయంటూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ, అసెంబ్లీలో నినాదాలు చేశారు వైఎస్సార్సీపీ సభ్యులు. ఆ తర్వాత ఈ సమావేశాలను వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు అసెంబ్లీకి వస్తున్న సమయంలో పోలీసుల ప్రవర్తనపై వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లేకార్డులు పట్టుకొని రావడాన్ని పోలీసులు ఒప్పుకోలేదు. సభ్యుల నుంచి వాటిని లాక్కొని చించే ప్రయత్నం చెయ్యడంతో జగన్ పోలీసులపై సీరియస్ అయ్యారు.
“అధికారం శాశ్వతం కాదు. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉంది. చట్ట ప్రకారం పోలీసులు పని చేయాలి,” అని జగన్ ఆవేశంగా ప్రశ్నించారు.