‘నారసుర’ రక్తచరిత్ర బుక్ లెట్ విడుదల

Narasura

కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజాస్వామ్య నియమాలు పాటించకుండా, ఆటవిక పాలన కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం కూటమి పాలనని ఎండగడుతూ ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేపట్టారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి, వందల ఇళ్లను ధ్వంసం చేశారంటూ జగన్ మండిపడ్డారు. అంతేకాదు, “నరసుర రక్తచరిత్ర 4.ఓ” పేరుతో ఒక బుక్ లెట్ ని కూడా విడుదల చేసింది వైఎస్సార్సీపీ.

జగన్ చేపట్టిన ఈ ధర్నాకు సమాజ్ వాది పార్టీ సంఘీభావం తెలిపింది. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ ని కలిసి మద్దతు ప్రకటించారు. ఏపీలోని పరిస్థితులను వీడియోల ద్వారా అఖిలేష్ యాదవ్ కి జగన్ వివరించారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటాం అన్నారు.

Google News