Pranitha

హీరోయిన్ ప్రణీత రెండో రౌండ్ కు రెడీ అయింది. ఇదేదో రీఎంట్రీనో లేక సీక్వెల్ సినిమానో అనుకోవద్దు. వ్యక్తిగత జీవితంలో పిల్లల పరంగా రెండో రౌండ్ షురూ అయిందని చెబుతోంది. అవును.. ప్రణీత గర్భం దాల్చింది.

తను మరోసారి గర్భం దాల్చిన విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఘనంగా ప్రకటించింది. తన బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇకపై ఈ ప్యాంట్లు తనకు సరిపోవని కూడా స్టేట్ మెంట్ ఇచ్చింది.

కరోనా టైమ్ లో వ్యాపారవేత్త నితిన్ ను పెళ్లాడింది ప్రణీత. పెళ్లయిన ఏడాదికే పాపకు జన్మనిచ్చింది. 2022లో పాప జన్మించింది. ఇప్పుడు రెండేళ్ల గ్యాప్ లో మరో బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అవుతోంది.

ఓవైపు ఇలా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు సినిమాల్లో కూడా కొనసాగుతోంది ప్రణీత. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలు చేస్తోంది. కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని, బాబు లేదా పాప పుట్టిన తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తానంటోంది ఈ బ్యూటిఫుల్ మామ్. 

Google News