అల్లు అర్జున్ కాదు.. ప్రభాస్

Prabhas in The Raja Saab

సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ నడిచింది. ప్రభాస్ నుంచి ఓ పోస్టర్ రిలీజైంది. రాజాసాబ్ సినిమా నుంచి అప్ డేట్ రాబోతోందనేది ఆ పోస్టర్ సారాంశం. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ప్రభాస్ ను చూసి అల్లు అర్జున్ గా భ్రమపడ్డారు.

ప్రభాస్-బన్నీ బెస్ట్ ఫ్రెండ్స్ కావొచ్చు కానీ ఫిజిక్ పరంగా ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది. కాకపోతే రిలీజ్ చేసిన పోస్టర్ లో వెనక నుంచి ప్రభాస్ ను చూపించారు. అది కాస్తా అల్లు అర్జున్ స్టిల్ లా అనిపించడానికి ఓ కారణం ఉంది.

అల వైకుంఠపురములో అల్లు అర్జున్ వేసిన ఎరుపు రంగు కోటు బాగా క్లిక్ అయింది. ఇందులో ప్రభాస్ కూడా అదే కోటు వేసుకున్నాడు. పైగా ఆ సినిమాలో బన్నీ ఎలాంటి హెయిర్  స్టయిల్ తో కనిపించాడో, దాదాపు అదే హెయిర్ స్టయిల్ లో ప్రభాస్ కూడా కనిపించాడు.

పోస్టర్ లో కారు, కిటికీ లాంటి సెటప్ కూడా ‘అల వైకుంఠపురములో’ని బుట్టబొమ్మ సాంగ్ ను గుర్తుచేసింది. దీనికితోడు ప్రభాస్ ముఖాన్ని చూపించలేదు. దీంతో చాలామంది అది అల్లు అర్జున్ ఫొటోలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.