బోనం ఎత్తిన తమన్నా

Tamannaah Bhatia in Odela 2

ఇది బోనాల పండుగ టైం. హైదరాబాద్ గల్లీల్లో మొత్తం బోనాల పండగ వాతావరణమే. తాజాగా హీరోయిన్ తమన్నా కూడా బోనం ఎత్తింది. ఐతే, ఆమె బోనం ఒక సినిమా కోసం ఎత్తింది.

2021 బ్లాక్‌బస్టర్ “ఒదెల రైల్వే స్టేషన్‌” సీక్వెల్ గా వస్తున్న “ఒదెల 2” షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన ఓదెల మల్లన్న దేవాలయం సెట్ లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. తమన్నా, ఇతర నటీనటులతో పాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది కూడా బోనాల ఎపిసోడ్. సినిమాలో అమ్మవారికి హీరోయిన్ బోనం సమర్పించే సన్నివేశాన్ని తాజాగా తీశారు. ఆ ఫోటోని విడుదల చేసింది టీం.

చీర కట్టుకుని, తమన్నా భాటియా తలపై బోనం మోస్తూ అద్భుతంగా కనిపించింది ఈ ఫొటోలో.

తమన్నా భాటియా హీరోయిన్ గా ఈ మూవీని అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్నారు. సంపత్ నంది పర్యవేక్షణ చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Google News