మెడ్ ప్లస్ వివాదంలో శివజ్యోతి

Siva Jyothi

బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు ఆమె ఒక వివాదంలో ఇరుక్కొంది.

శివజ్యోతి అనేక యాడ్స్ చేస్తుంటుంది. కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తుంది. ఆమె మెడ్ ప్లస్ సంస్థని కూడా బాగా ప్రమోట్ చేసింది. ఐతే, ఈ సంస్థపై ఇప్పుడు ఆరోపణలు మొదలయ్యాయి.

మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ప్రతి మందులపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఐతే, ఈ డిస్కౌంట్ అంతా మాయ అని, ఈ సంస్థ వినియోగదారులను ఎలా మోసం చేస్తుందో తెలుపుతూ తాజాగా కొందరు సోషల్ మీడియాలో వివరాలు బయటపెట్టారు. ఈ విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. దాంతో, మెడ్ ప్లస్ ఆ వివాదంలో అడ్డంగా ఇరుక్కొంది. ఐతే, తాము ధరలను పెంచి ఆ తర్వాత భారీగా డిస్కౌంట్ ఇస్తూ మాయ చేస్తున్నామని వచ్చిన ఆరోపణలను ఆ సంస్థ తిప్పి కొట్టింది.

దాంతో, బ్రాండ్ అంబాసిడర్ గా తనకు కూడా బాధ్యత ఉంది అంటూ శివజ్యోతి స్వయంగా ఒక వీడియో చేసి అసలు మేటర్ ఏంటో చెప్పే ప్రయత్నం చేసింది.

Google News