“కన్నప్ప”లో మధుబాల లుక్ ఇదే

Madhubala in Kannappa

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్… “కన్నప్ప”. విష్ణు ఈ సినిమాని భారీ ఎత్తున తీస్తున్నాడు. తాను హీరోగా నటించడమే కాదు పేరొందిన స్టార్స్ ని కూడా నటింప చేస్తున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి బడా హీరోలు అతిథి పాత్రల్లో కనిపిస్తారు.

అలాగే ఈ సినిమాలో శరత్ కుమార్, బ్రహ్మానందం, కన్నప్ప వంటి వారు నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో మధుబాల పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఒక లుక్ రిలీజ్ చేశారు. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉంది ఆమె లుక్.

50 ఏళ్ల మధుబాల ఇలాంటి వీరోచిత పాత్రలో నటించడం విశేషమే.

“కన్నప్ప” విజువల్ వండర్‌గా రాబోతోంది. టైటిల్ పాత్రలో విష్ణు మంచు కనిపిస్తారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు.

Google News