తెగ ట్రోలింగ్ అవుతోన్న కీర్తి

Keerthy Suresh

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్ అవ్వడానికి కారణం. ఇదే ఇంటర్వ్యూలో ఆమె చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అని ప్రకటించింది. దీంతో టాలీవుడ్ లో కీర్తిసురేష్ పై తిట్ల వర్షం కురుస్తోంది.

ఎవరు బెస్ట్ డాన్సర్ అంటూ యాంకర్ కొన్ని పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు. చివరికి వచ్చేసరికి విజయ్, చిరంజీవి మిగిలారు. దీంతో ఎవరి పేరు చెప్పాలో తెలియక కాసేపు తటపటాయించింది కీర్తి. కొద్దిసేపటి తర్వాత విజయ్ పేరు చెప్పింది.

ఇదే ఇంటర్వ్యూ టాలీవుడ్ లో జరిగి, ఇదే ప్రశ్న రిపీట్ చేస్తే కచ్చితంగా చిరంజీవి పేరు చెప్పి ఉండేది కీర్తిసురేష్. తమిళ్ లో జరిగిన ఇంటర్వ్యూ కాబట్టి విజయ్ పేరు చెప్పింది.

గతంలో చిరంజీవితో కలిసి “భోళాశంకర్” సినిమా చేసింది కీర్తిసురేష్. చిరుకు చెల్లెలిగా నటించింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవిని ది బెస్ట్ డాన్సర్ గా చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో విజయ్ పేరు చెప్పి, మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది.

Google News