మహిళలపై టీడీపీ వరుసదాడులు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో ఓడిపోతామనే భయం కలిగిన పార్టీలు, నేతలు తమ ప్రత్యర్థులపై దాడులకి పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు ఉండకూడదు. కానీ వైసీపీ మహిళలను టార్గెట్ చేస్తూ వరుసగా దాడుల జరుగుతున్న తీరును చూస్తుంటే తెలుగు దేశం పార్టీ నేతలు ఒక ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారు అనే అనుమానం కలుగుతోంది.

మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ్యపై ఈ రోజు దాడి జరిగింది. దాడి జరిగిన దృశ్యాలు, పాల్పడిన వారి విజువల్స్ సిసిటీవీలో బంధీ అయ్యాయి. ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారని రమ్య అంటున్నారు.

Advertisement

ఇలా వైఎస్సార్సీపీ నేతలు, మహిళలపై దాడులు ఇటీవల వరుసగా జరుగుతున్నాయి.

నిన్న హోంమంత్రి తానేటి వనతిపై గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో దాడి జరిగింది. అలాగే విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై దాడి చేశారు. అంతకుముందు మంత్రి బాలినేని కోడలుపై ఒంగోలులో దాడి జరిగిన విషయం తెలుసు.

ఇలా వరుస దాడుల వైనం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నట్లు అర్థం అవుతోంది అని వైకాపా నేతలు అంటున్నారు.