బాబు ఫిర్యాదుతో సంక్షేమ పథకాలకు ఈసీ మోకాలడ్డూ… ప్రజల వెతలు

బాబు ఫిర్యాదుతో సంక్షేమ పథకాలకు ఈసీ మోకాలడ్డూ… ప్రజల వెతలు

మారవా.. నువ్వు మారవా అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా..! ఇంకోటి చెబుతా ఆగండి.. నువ్వు యదవ కాదు అని అనుకున్న ప్రతీసారి అంతకు మించి అని ప్రూవ్ చేసుకుంటున్నావు.. అనేదీ గుర్తుంటుందిలే..! కానీ ఈ రెండు డైలాగులకు వంద రెట్లు మించి టీడీపీ అధినేత చంద్రబాబు. నిరు పేదలపై జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎన్నికలకు గడువు వారం కూడా లేకపోవడం.. కూటమి ఘోర పరాజయాన్ని మూట కట్టుకాబోతున్నారు అని సర్వేలు తేల్చి చెప్పడంతో ఏం చేయడానికి అయినా బాబు వెనుకాడలేదు. ఆఖరికి నిరుపేదలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి పైత్యం ప్రదర్శించారు.

నిలిపివేత!!

Advertisement

పెన్షన్లు.. వలంటీర్లు విషయంలో వృద్దులు, వితంతువులు.. వికలాంగులతో చీ.. ఛీ కొట్టించుకున్న చంద్రబాబు ఐనా ఇతనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇదిగో ఇప్పుడు పేదలపై పగపట్టి.. వారికి సంక్షేమ పథకాలను ఇవ్వకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఐనా జనాలు నమ్మకపోవడంతో ఏం చేసైనా సరే గెలవాలని.. జగన్ రెడ్డిని చెడ్డ చేయాలని తాజాగా ఎన్నికల కమిషన్ ను పథకాలపై ఆశ్రయించి నిలిపివేసి తన ఇగో సాటిసీఫై చేసుకొన్నారు. దీంతో జనాలు చంద్రబాబు కనిపిస్తే చాలు కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు. 

ఇదిగో ఇదే బాబు చేసింది..!!

జగనన్న ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు చేరకుండా ఈసీకి ఫిర్యాదులు చేసి నిలిపేసి.. పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. దీంతో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫలితంగా తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ మోకాలడ్డింది. మరోపక్క ఖరీఫ్ పంటకు సన్నద్దమవుతున్న రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోయింది.

విద్యార్ధులకు ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు నిలిచిపోయాయి. చంద్రబాబును తరిమేసే రోజులు అసన్నమవుతున్నాయి ఒక్క నెల రోజులు ఓపిక పడితే మళ్ళీ జగనన్న పాలనలో మళ్ళీ పేదలు జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. చూశారుగా ఎలాంటి పనులు చేయదని ఐనా బాబు సిద్ధమవుతున్న ఈ పరిస్థితుల్లో జనాలు గమనించి.. ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించి ఓటు వెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.