ఐటెంసాంగ్స్… డింపుల్ కి ఉన్న ఛాయిస్ అదే!

Dimple Hayathi

డింపుల్ హయతి… ఈ భామ గురించి పరిచయం అక్కర్లేదు. అందాలు అరబోయడంలో అస్సలు బ్రేకులు వెయ్యదు. గ్లామర్ షో చేస్తూ బిజీ అయిపోదామని ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ భామ . వెంటవెంటనే ఇద్దరు మాస్ హీరోల సరసన నటించింది. కానీ ఫలితం దక్కలేదు.

మోస్ట్ ఎట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగిన ఈ బ్యూటీకి, అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ రావట్లేదు.

ఆమె ఇప్పటివరకు తెలుగులో నటించిన చిత్రాలు నాలుగు. కానీ ఎక్కువగా “ఖిలాడీ” సినిమాతో పాపులర్ అయింది. కానీ ఖిలాడీ కంటే చాలా ఏళ్ల కిందటే ఆమె తెలుగులో సినిమాలు చేసింది. గల్ఫ్, గద్దలకొండ గణేష్, అభినేత్రి 2 సినిమాలు చేశాక “ఖిలాడీ”లో అవకాశం దక్కించుకొంది. “గద్దలకొండ గణేశ్”లో చేసిన స్పెషల్ సాంగ్ తో ఆమెకు పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత రవితేజ సరసన చేసిన “ఖిలాడీ” సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చింది. .

కానీ ఖిలాడీ ఫ్లాప్ అవ్వడంతో డింపుల్ ఆశలు గల్లంతయ్యాయి. ఆ తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన “రామబాణం”లో హీరోయిన్ గా నటించింది. అది కూడా తుస్సుమంది. ఇప్పుడు ఈ భామ మళ్ళీ స్పెషల్ సాంగ్ లపై ఫోకస్ పెట్టిందట.

Dimple Hayathi

ఐటెంసాంగులతో కెరీర్ ని కాపాడుకోవాలనుకుంటోంది. డ్యాన్స్ చెయ్యడంలో దిట్ట. అందాలు తెరపై పర్చడంలో సూపర్. సో, ఐటెం సాంగ్స్ ఆమెకి ఇప్పుడు దిక్కు అవుతున్నాయి. మరి పెద్ద హీరోయిన్లతో ఐటెం సాంగ్స్ చేయిస్తున్న మన మేకర్స్ ఈ భామకి ఛాన్సులు ఇస్తారా?

Google News