ధర్మందే విజయం… పొత్తుదే గెలుపు: జనసేనాని

Pawan Kalyan

“ధర్మందే విజయం
పొత్తుదే గెలుపు
కూటమిదే పీఠం”

ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం. “ప్రజాగళం” సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించుతామని ధీమాగా చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ ని గద్దె దింపడం కష్టం కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. రావణాసురిడి లాంటి జగన్ ని ఓడించేందుకు అయోధ్యకు రాముడిని తెచ్చిన మోదీ ఇక్కడికి వచ్చారని పవన్ కళ్యాణ్ ఘాటుగా మాట్లాడారు.

“జగన్ తనకు అడ్డు అదుపు లేదు అనుకుంటున్నారు. రావణుడు కూడా తన చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది. వజ్రవైఢూర్యాలతో కూడిన పుష్పకవిమానం ఉంది. ధీరులు శూరులు ఉన్నారు. మందీ మార్బలం ఉంది, బలం ఉంది అనుకున్నాడు. నన్ను ఏమి చెయ్యగలడు అనుకున్నాడు. కానీ నార చీర కట్టుకొని నేలమీద పడుకొని శ్రీరాముడు తన బాణంతో రావణుడిని చంపేశాడు. అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన మన ప్రధాని మోదీ ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన చిటికెన వేలెడంతటి రావణాసురుడిని తీసెయ్యటం అంత కష్టమా?” అని ప్రశ్నించారు జనసేనాని.

“నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను నేను ఇక్కడి నుంచి దేవదత్తం పూరిస్తున్నాను అని. దేవదత్తం అంటే అర్జనుడు పూరించిన శంఖం. పాంచజన్యం పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీ కృష్ణుడే. మన ప్రధానే,” అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Google News