వికసిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం: మోదీ

PM Modi

తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి మొదటి సభని ఆదివారం నిర్వహించాయి. ఈసారి ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. చిలకలూరిపేట బొప్పూడిలో నిర్వహించిన “ప్రజాగళం” సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ప్రధానితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సభావేదికని పంచుకున్నారు. అధికారమే లక్ష్యంగా ఈ సభని నిర్వహించారు. మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

ప్రధాని స్పీచ్ ప్రధానాంశాలు

  • ఈసారి ఎన్డీఏ కూటమికి 400 + స్థానాలు వస్తాయి అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మమ్మల్ని గట్టిగా ఆశీర్వాదించాలి. ఆ సంఖ్య మరింతగా పెరుగుతుంది.
  • వికసిత భారత్ మా లక్ష్యం. దాంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ ని చూడాలనుకుంటున్నాం.
  • అవినీతిలో కూరుకుపోయిన ఇక్కడి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి. మీరు రెండు సంకల్పాలు తీసుకోవాలి. ఒకటి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని మళ్ళీ నెలకొల్పాలి. రెండోది రాష్టంలో మా కూటమిని అధికారంలోకి తేవాలి.
  • ఎన్టీఆర్ కాంగ్రెస్ ని మట్టికరిపించారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే తెలుగుదేశం పుట్టింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వంద రూపాయల వెండి నాణెం విడుదల చేశాం. తెలుగువాడైన మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నాం.
  • కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ ఒక్కటే. రాష్టంలో రెండు పార్టీలను ఒకే కుటుంబానికి చెందిన వారు నడుపుతున్నారు. అంటే ఆ రెండుపార్టీలు ఒక్కటే.