రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో గురించి ఆసక్తికర విషయాలు..

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో గురించి ఆసక్తికర విషయాలు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ తర్వాత ఒకదాని వెంట ఒకటి చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ తాజాగా వైజాగ్‌లో ప్రారంభమైంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసుకుని నెక్ట్స్ సినిమాను లైన్‌లో పెట్టాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. ఇక నెక్ట్స్ సినిమా వచ్చేసి బుచ్చిబాబు సానతో చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘ఆర్‌సి 6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ నెల 20న సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుందట. ఇప్పటి వరకూ రామ్ చరణ్ తన కెరీర్‌లోనే స్పోర్ట్స్ జోనర్‌లో సినిమా చేసింది లేదు. దీంతో సినిమాపై ఆసక్తి బాగా పెరిగింది.

Advertisement

మే నెల నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ సినిమాలో భావోద్వేగాలకు బుచ్చిబాబు పెద్ద పీట వేయనున్నారట. ఇక ఈ సినిమా గురించి మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కోసం సెలక్ట్ చేసి ఉంచిన టైటిల్‌ను ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్‌కి వాడేస్తున్నారట. ‘పెద్ది’ అనే టైటిల్‌ను బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం సెలక్ట్ చేసి పెట్టారట. కానీ తారక్‌తో సినిమా ఎప్పుడు అవుతుందో ఏమోనని రామ్ చరణ్‌తో తీయనున్న స్పోర్ట్స్ డ్రామాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను బుచ్చిబాబు వాడేస్తున్నారట.