బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్‌లో ఎన్టీఆర్..

బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్‌లో ఎన్టీఆర్..

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా నడుస్తోంది. టాలీవుడ్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఘనత మాత్రం దర్శకధీరుడు రాజమౌళిదే. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌‌తో పాటు ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఊర మాస్ కేరెక్టర్‌లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

ఇక తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ న్యూస్ కన్నడ సినీ పరిశ్రమలో తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ విషయం గురించే చర్చ. అదేంటంటే.. కాంతార మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మాల్ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నారట.

అయితే ఈ సీక్వెల్‌లో తారక్ నటిస్తున్నాడట. ఇప్పటికే చిత్ర యూనిట్‌ తారక్‌ను సంప్రదించిందట. దీనికి మన యంగ్ టైగర్ కూడా ఓకే చెప్పేశాడని కన్నడ నాట ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఇమేజ్‌కి ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా ఆయన కేరెక్టర్‌ను దర్శకుడు తీర్చిదిద్దుతున్నారట. ఇటీవలే ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం బెంగుళూరుకు వెళ్లిన ఎన్టీఆర్ రిషబ్ శెట్టిని కలిశాడట. ఎన్టీఆర్ నటిస్తున్నాడనే టాక్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.