అవును పృథ్వీరాజ్‌తో బ్రేకప్ నిజమే..: అంగీకరించిన శీతల్..

అవును పృథ్వీరాజ్‌తో బ్రేకప్ నిజమే..: అంగీకరించిన శీతల్..

బబ్లూ పృథ్వీరాజ్‌.. పేరు వినగానే పెళ్లి సినిమా గుర్తు రాక మానదు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలి కాలంలో బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ పృధ్వీ చాలా యాక్టివ్‌గా ఉంటారు. గతంలో బీనా అనే మహిళను పెళ్లాడిన పృధ్వీ.. కొంత కాలం తర్వాత ఇద్దరికీ పొసగకపోవడంతో విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత పృధ్వీ శీతల్ అనే తెలుగమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆమెతో సహజీవనం కూడా చేశాడు. ఆమెను రహస్య వివాహం చేసుకున్నాడని టాక్ కూడా నడిచింది. పృధ్వీ ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియోను డిలీట్ చేయడంతో ఆ రూమర్స్‌కు బలం చేకూరింది. అయితే నిజంగానే వీరిద్దరి బంధం కూడా ముణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. బ్రేకప్ నిజమేనని శీతల్ తెలిపింది. దీనికి సంబంధించి ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.

అవును పృథ్వీరాజ్‌తో బ్రేకప్ నిజమే..: అంగీకరించిన శీతల్..

చాలా మంది పృధ్వీతో తన రిలేషన్ గురించి ప్రశ్నలు అడుగుతున్నారని.. తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించుకుంటున్నారని తెలిపింది. పృధ్వీతో కేవలం తనది సహజీవనం మాత్రమేనని.. తమ మధ్య వివాహ బంధం లేదని తెలిపింది. తమ రిలేషన్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయామని.. అయితే తమ ప్రయాణంలో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయని తెలిపింది. కొద్ది నెలల క్రితమే తాము విడిపోయామని శీతల్ వెల్లడించింది.

Google News