ముంబైలో స్టార్ యాక్టర్స్ పక్కన ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ

యానిమల్‌ సినిమాతో  యూత్‌ మనసులో గట్టిగా ముద్ర వేసుకున్న బ్యూటీ తృప్తి డిమ్రి. అంతకు ముందు పలు సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించినా కూడా యానిమల్ చిత్రంతోనే ఈ ముద్దుగుమ్మకు కావల్సినంత క్రేజ్ వచ్చింది. అందం, నటనతో తృప్తి డిమ్రి యూత్‌ను కట్టిపడేసింది. ఒక్కసారిగా యానిమల్‌ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది.

తాజాగా తృప్తి డిమ్రి ఓ ఇంటిదైంది. ఏదో మారుమూల ప్రాంతంలో కాదు. ముంబైలో సెలబ్రిటీలు నివాసముండే బాంద్రా ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేసింది. సుమారు 247 గజాల విస్తీర్ణంలో  రెండు అంతస్థుల ఇల్లట. దీని ఖరీదెంతో తెలుసా? ఏకంగా రూ.14 కోట్లు. ఈ ఇంటికి  స్టాంప్‌ డ్యూటీ కింద రూ.70 లక్షలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.30,000 చెల్లించిందట. ఈ లెక్కన చూస్తే దాదాపు రూ.15 కోట్లు. 

మొత్తానికి ముద్దుగుమ్మ సల్మాన్, షారుఖ్, ఆలియా వంటి స్టార్స్ ఇళ్ల పక్కన ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపోయింది. ఉత్తరాఖండ్‌కు చెందిన తృప్తి.. మామ్‌, పోస్టర్‌ బాయ్స్‌, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. బుల్ బుల్ చిత్రం అమ్మడి కెరీర్‌కి హైప్ ఇచ్చింది. ప్రస్తుతం తృప్తి  ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ‘భూల్ భులాయా’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. వీటితో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024