ముంబైలో స్టార్ యాక్టర్స్ పక్కన ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ

ముంబైలో స్టార్ యాక్టర్స్ పక్కన ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ

యానిమల్‌ సినిమాతో  యూత్‌ మనసులో గట్టిగా ముద్ర వేసుకున్న బ్యూటీ తృప్తి డిమ్రి. అంతకు ముందు పలు సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించినా కూడా యానిమల్ చిత్రంతోనే ఈ ముద్దుగుమ్మకు కావల్సినంత క్రేజ్ వచ్చింది. అందం, నటనతో తృప్తి డిమ్రి యూత్‌ను కట్టిపడేసింది. ఒక్కసారిగా యానిమల్‌ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది.

తాజాగా తృప్తి డిమ్రి ఓ ఇంటిదైంది. ఏదో మారుమూల ప్రాంతంలో కాదు. ముంబైలో సెలబ్రిటీలు నివాసముండే బాంద్రా ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేసింది. సుమారు 247 గజాల విస్తీర్ణంలో రెండు అంతస్థుల ఇల్లట. దీని ఖరీదెంతో తెలుసా? ఏకంగా రూ.14 కోట్లు. ఈ ఇంటికి స్టాంప్‌ డ్యూటీ కింద రూ.70 లక్షలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.30,000 చెల్లించిందట. ఈ లెక్కన చూస్తే దాదాపు రూ.15 కోట్లు.

ముంబైలో స్టార్ యాక్టర్స్ పక్కన ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ

మొత్తానికి ముద్దుగుమ్మ సల్మాన్, షారుఖ్, ఆలియా వంటి స్టార్స్ ఇళ్ల పక్కన ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపోయింది. ఉత్తరాఖండ్‌కు చెందిన తృప్తి.. మామ్‌, పోస్టర్‌ బాయ్స్‌, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. బుల్ బుల్ చిత్రం అమ్మడి కెరీర్‌కి హైప్ ఇచ్చింది. ప్రస్తుతం తృప్తి  ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ‘భూల్ భులాయా’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. వీటితో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.