ప్రభాస్ సినిమాను మాత్రమే ఆ నటుడి కూతురు చూసిందట..

ప్రభాస్ సినిమాను మాత్రమే ఆ నటుడి కూతురు చూసిందట..

ప్రభాస్‌ కెరీర్‌లో అత్యంత డిజాస్టర్‌ మూవీ ఆదిపురుష్‌. భారీ బడ్జెట్‌తో రూపొందినా కూడా జనాన్ని అలరించలేక పోయింది. బాలీవుడ్ నటుడు, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌ శరద్‌ కేల్కర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కూతురు ఇప్పటి వరకూ చూసిన ఏకైక సినిమా ఆదిపురుష్‌ అని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అసలు తన సినిమాల గురించి తన కూతురు కేశ ఏమాత్రం పట్టించుకోదని అన్నారు.

అసలు తను నటించిన చిత్రాలేవీ ఇంతవరకూ తన కూతురు చూడలేదని శరద్ కేల్కర్ తెలిపారు. టీవీ షోలు, సినిమాలపై అంతగా ఆసక్తి చూపించదు కాబట్టే తన వృత్తేంటో కూతురికి తెలియదన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అదే బాగుంటుందని… తనిలా అమాయకంగా ఉంటేనే సంతోషమని అన్నారు. అయితే ఆదిపురుష్ మూవీలో తన వాయిస్ విని కేశ ఆశ్చర్యపోయిందని శరద్ కేల్కర్ వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు తనేంటో, తన పాపులారిటీ ఎలా ఉంటుందో కేశకు తానే పరిచయం చేస్తానన్నారు.

ప్రభాస్ సినిమాను మాత్రమే ఆ నటుడి కూతురు చూసిందట..

అలా తను పరిచయం చేసే వరకూ అందరు పిల్లల మాదిరిగానే కేశ తన బాల్యాన్ని ఎంజాయ్ చేయాలన్నారు. కేశ ఇంతవరకూ తన సినిమాలేవీ చూడలేదు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆదిపురుష్ మాత్రం చూసిందని.. తన వాయిస్‌ను గుర్తిపట్టి ఆశ్చర్య పోయిందని శరద్ కేల్కర్ తెలిపారు. అప్పుడప్పుడు యానిమేషన్‌ చిత్రాలు మాత్రమే చూస్తూ ఉంటుందని.. తను కాస్త పెరిగి పెద్దయ్యాక యాక్షన్‌ కామెడీ సినిమాలు కూడా చూపించడం మొదలుపెడతానని శరద్ కేల్కర్ వెల్లడించారు.

Google News