బాలయ్య, తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టిన విజయశాంతి..

బాలయ్య, తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టిన విజయశాంతి..

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా విజయశాంతి ఒక వెలుగు వెలిగారు. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. కొంత కాలం క్రితం దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఆమె కొంతకాలం పాటు తన హవాను కొనసాగించారు. శోభన్‌బాబు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించారు.

ఆమె ఎక్కువగా చిరుతో పాటు బాలయ్యతో నటించారు. అయితే ఎందుకోగానీ విజయశాంతి  ‘నిప్పురవ్వ’ సినిమా తరువాత బాలయ్యతో కలిసి నటించలేదు. దీనిపై రకరకాల రూమర్స్ వినిపించాయి. కారణం ఇదంటే.. కాదు ఇదంటూ ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఆ రూమర్స్ అన్నింటికి విజయశాంతి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. బాలకృష్ణగారితో ‘నిప్పురవ్వ’ తరువాత నటించకపోవడానికి వేరే కారణమంటూ ఏమీ లేదని.. ఆ సమయంలో తాను వేరే సినిమాలతో బిజీగా ఉండమేనని తేల్చి చెప్పారు.

నిప్పురవ్వ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు వరుసగా విజయశాంతి సైన్ చేశారట. ఎందుకోగానీ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సంబంధించిన కథలే తన వద్దకు వచ్చాయని తెలిపారు. అవన్నీ కూడా ఒక హీరో స్థాయి సినిమాలతో సమానంగా ఆడటంతో రెమ్యూనరేషన్ సైతం భారీగానే తీసుకున్నారట. ఇలా తనకు ఒక హీరో ఇమేజ్ రావడం కానీ.. యాక్షన్ సినిమాలు చేస్తానని కానీ తద్వారా బిజీ అవుతానని కానీ ఊహించలేనదని విజయశాంతి తెలిపారు. అందుకే వేరే హీరోలతో సినిమాలు చేయలేదని స్పష్టం చేశారు.