నేనెప్పుడూ పోటీని నెగిటివ్‌గా చూడను!

నేనెప్పుడూ పోటీని నెగిటివ్‌గా చూడను!

స్టార్‌ హీరోయిన్‌ సమంత సినిమాలు చేయకున్నా కూడా తన స్టార్‌డమ్‌ను మాత్రం కోల్పోవడం లేదు. ఇంకా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్‌ 100 మోస్ట్‌ వ్యూడ్ ఇండియన్‌ స్టార్స్‌’ జాబితాలో సమంత 13వ స్థానాన్ని సొంతం చేసుకుని తానేంటో నిరూపించకుంది. ఇండస్ట్రీలో పోటీ అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే ఇండస్ట్రీ నుంచి కొన్ని నెలల పాటు పక్కకు జరిగినా కూడా జనాలు వారిని మరచిపోతారు.

అయితే సమంత విషయంలో అలా ఏమీ జరగడం లేదు. మంచి పోటీ వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుందని… ప్రతీ రంగంలో ఒకరితో మరొకరు పోల్చుకోవడం సహజమని సమంత తెలిపింది. తానెప్పుడూ పక్కవారిని చూసి స్ఫూర్తి పొందుతూనే ఉంటానని వెల్లడించింది. పక్క వారి విజయాలను చూసి తాను మరింత ఎక్కువగా కష్టపడుతూ ఉంటానని వెల్లడించింది. తానెప్పుడూ పోటీని నెగెటివ్‌గా చూడనని సమంత స్పష్టం చేసింది.

ఐఎండీబీ జాబితాలో13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని.. ఇది తన కష్టానికి దక్కిన ప్రతిఫలమని సమంత వెల్లడించింది. సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’లో నటిస్తోంది. అంతేకాకుండా దీనికి నిర్మాతగా కూడా వ్యవరిస్తోంది. మరో విశేషమేంటంటే.. సమంత సొంత నిర్మాణ సంస్థ  ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’పై రూపొందుతున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం. సమంత నటించిన వెబ్ సిరీస్ సిటడెల్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.