ఈ ముద్దుగుమ్మకి టీనేజ్ గుర్తొచ్చిందట.. ఎందుకో తెలుసా?

ఈ ముద్దుగుమ్మకి టీనేజ్ గుర్తొచ్చిందట.. ఎందుకో తెలుసా?

సినిమాల్లోకి ఎంట్రీ దొరికినంత ఈజీగా ఉండదు కెరీర్. సినిమాల్లోకి ఎంట్రీ కూడా అంత ఈజీ ఏమీ కాదులెండి. ఈజీ ఎంట్రీ అనేది వారసులకు మాత్రమే సాధ్యం. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అందరూ ఒక్కటే. ఎవరైనా కష్టపడాల్సిందే. లేదంటే కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉంటుంది. ఎదగాలంటే ఒదిగి ఉండాలి. బోలెడంత కష్టపడాలి. లేదంటే మన ప్రయాస అంతా వృథా అయిపోతుంది. లైగర్‌ బ్యూటీగా అనన్య పాండే పరిస్థితి కూడా ఇదే.

బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ అనన్యా పాండే.. తెలుగులో ఏమాత్రం రాణించలేకపోయింది. దీంతో బాలీవుడ్ సినిమాలు అడపా దడపా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగమ్మకి టీనేజ్‌ జ్ఞాపకాలు గుర్తొచ్చాయట. హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చాయంటారా? ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ అనే అమెరికన్‌ యానిమేటెడ్‌ ఫిల్మ్‌ కారణంగా గుర్తొచ్చాయట. కెల్సీ మన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్‌ తారలు అమీ పోహ్లర్, ఫిలిస్‌ స్మిత్, లూయిస్‌ బ్లాక్, టోనీ హేల్‌ వంటి వారు ఈ సినిమాలోని హ్యాపీ, సాడ్‌నెస్, యాంగర్‌ వంటి ఎమోషన్స్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

ఈ ముద్దుగుమ్మకి టీనేజ్ గుర్తొచ్చిందట.. ఎందుకో తెలుసా?

ఇదే సినిమాలో రిలే ఆండర్సన్‌ అనే ఓ 13 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయి పాత్రకు హిందీ వెర్షన్‌లో అనన్య పాండే వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈ సందర్భంగా అనన్యా పాండే మాట్లాడుతూ.. ‘పిక్సర్‌ అండ్‌ డిస్నీ స్టూడియోల యానిమేషన్‌ చిత్రాలకు తాను అభిమానిని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థల నుంచే ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ వస్తోందని.. అలాంటి సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం హ్యాపీగా ఉందని అనన్య వెల్లడించింది. రిలే పాత్రకు వాయిస్‌ ఓవర్‌ చెబుతున్నప్పుడు తనకు టీనేజ్‌ గుర్తొచ్చిందని అనన్యా పాండే తెలిపింది.