హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ కమెడియన్ పెళ్లి చేసుకున్నాడు..

హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ కమెడియన్ పెళ్లి చేసుకున్నాడు..

ఇండస్ట్రీలో ముదురు బెండకాయలకు కొదువేమీ లేదు. పెళ్లెప్పుడు అంటే మాట దాటవేస్తారు తప్ప సమాధానం ఉండదు. ప్రముఖ తమిళ దర్శకుడు గంగై అమరన్‌ రెండో కుమారుడు, నటుడు ప్రేమ్‌జీ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. 45 ఏళ్ల వయసులో ఈ కమెడియన్ పెళ్లి పీటలెక్కాడు. తిరుత్తణి మురుగన్‌ సాక్షిగా తన ప్రియురాలు ఇందు మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, బంధువులను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు.

గత కొంతకాలంగా ప్రేమ్‌జీ సేలం నగరానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ఇందును ప్రేమిస్తున్నాడు. మరి వీళ్లిద్దరూ ఇంట్లో చెప్పలేదో లేదంటే వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదో.. లేదంటే ప్రేమ్‌జీ లేటు వయసులో ప్రేమలో పడ్డారో కానీ ఎట్టకేలకు పెద్దల అనుమతితో తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశాడు. తమిళనాడు తిరువళ్లూరులోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి సాక్షిగా వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ తారలు హాజరయ్యారు. వారి రాకతో తిరుత్తణి ఆలయంలో సందడి నెలకొంది.

సంప్రదాయబద్దంగా ప్రేమ్‌జీ వివాహం జరిగింది. తాళి కట్టిన అనంతరం భార్య అయిన తన ప్రియురాలిని పెళ్లి పీటలపైనే ప్రేమ్‌జీ ముద్దాడాదు.

అనంతరం నూతన దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వివాహ వేడుకకు తమిళ సినీ నటులు శివ, జయ్‌, వైభవ్‌, సంతాన భారతి, కార్తీక్‌రాజ, ఎస్‌పీబీ. చరణ్‌, క్రిష్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Google News