అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన కల్కి ట్రైలర్

అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన కల్కి ట్రైలర్

 ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు.

అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన కల్కి ట్రైలర్

ఇక ట్రైలర్ ఎలా ఉందంటే.. ప్రేక్షకుల అంచనాలను పక్కాగా రెట్టింపు చేసేలా ఉంది. బీభత్సమైన ఎలివేషన్స్‌తో పవర్ ఫుల్‌గా ఉంది. భైరవగా ప్రభాస్ బుజ్జితో సరదా సరదాగా కనిపించాడు. దీనికి తోడు యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక రాజేంద్ర ప్రసాద్ సైతం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. చాలా కాలం తర్వాత బ్రహ్మి వెండితెరపై కనిపించబోతున్నారు. కమల్ హాసన్ పాత్రను కూడా ట్రైలర్‌లో చూపించడం జరిగింది. ఈ భూమిపై మొదటి నగరమంటూ శ్రీకృష్ణ పరమాత్మను.. చివరి నగరమంటూ కాశీని ట్రైలర్ ప్రారంభంలో చూపించారు.

అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన కల్కి ట్రైలర్

యాక్షన్ సన్నివేశంలో అమితాబ్ కనిపించిన తీరు అద్భుతం. దీపికా పదుకొణె ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. అలాగే మరో బాలీవుడ్ అందాల తార దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్, పోస్టర్స్, ప్రభాస్ బుజ్జి కారు కల్కి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇప్పుడీ ట్రైలర్ చిత్రంపై అంచనాలకు మరింత హైప్ ఇచ్చింది. భైరవ్‌గా ప్రభాస్ నటించాడు.

అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన కల్కి ట్రైలర్