హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ కమెడియన్ పెళ్లి చేసుకున్నాడు..

ఇండస్ట్రీలో ముదురు బెండకాయలకు కొదువేమీ లేదు. పెళ్లెప్పుడు అంటే మాట దాటవేస్తారు తప్ప సమాధానం ఉండదు. ప్రముఖ తమిళ దర్శకుడు గంగై అమరన్‌ రెండో కుమారుడు, నటుడు ప్రేమ్‌జీ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. 45 ఏళ్ల వయసులో ఈ కమెడియన్ పెళ్లి పీటలెక్కాడు. తిరుత్తణి మురుగన్‌ సాక్షిగా తన ప్రియురాలు ఇందు మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, బంధువులను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు.

గత కొంతకాలంగా ప్రేమ్‌జీ సేలం నగరానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ఇందును ప్రేమిస్తున్నాడు. మరి వీళ్లిద్దరూ ఇంట్లో చెప్పలేదో లేదంటే వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదో.. లేదంటే ప్రేమ్‌జీ లేటు వయసులో ప్రేమలో పడ్డారో కానీ ఎట్టకేలకు పెద్దల అనుమతితో తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశాడు. తమిళనాడు తిరువళ్లూరులోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి సాక్షిగా వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ తారలు హాజరయ్యారు.  వారి రాకతో తిరుత్తణి ఆలయంలో సందడి నెలకొంది.

సంప్రదాయబద్దంగా ప్రేమ్‌జీ వివాహం జరిగింది. తాళి కట్టిన అనంతరం భార్య అయిన తన ప్రియురాలిని పెళ్లి పీటలపైనే ప్రేమ్‌జీ ముద్దాడాదు.

అనంతరం నూతన దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వివాహ వేడుకకు తమిళ సినీ నటులు శివ, జయ్‌, వైభవ్‌, సంతాన భారతి, కార్తీక్‌రాజ, ఎస్‌పీబీ. చరణ్‌, క్రిష్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024