Comedian Raghu: కమెడియన్ రఘు ఇంటిని చూశారా.. సినిమాల్లేవ్.. కామెడీ షోస్ లేవ్.. ఇదెలా సాధ్యం…!

Source: Suman TV

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీస్‌కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు సెలబ్రిటీస్‌ ఇళ్లను చూపించే పనిలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పడ్డాయి. తాజాగా కమెడియన్ కారుమంచి రఘు (Comedian Raghu) ఇంటిని చూపించారు. అది చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. ఎందుకంటే అది ఇల్లా ఇంద్ర భవనమా? అన్నట్టుగా ఉంది. విశాలమైన ఇల్లు… ఇంట్లో ఎక్కడ చూసిన మొక్కలు.. రూఫ్ గార్డెన్. కూరగాయలు అన్నింటినీ ఇంట్లోనే పండించుకుంటారు. 

Source: Suman TV

మొత్తానికి రఘు (Comedian Raghu)ది ఒక లగ్జరీ హౌస్. అసలు రఘు ఇల్లు అంత బాగుంటుందని ఎవరూ ఊహించలేదు. స్టార్ హీరోల రేంజ్‌లో కట్టేశాడు. ఏదో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటా? అంటే అదీ కాదు. ఇండివిడ్యువల్ హౌస్. పోనీ ఏమైనా దిక్కు మొక్కూ లేని ప్లేస్‌లో కట్టుకున్నాడా? అంటే అదీ కాదు.. ఖరీదైన ఏరియాలో ఉన్నతమైన కమ్యూనిటీ మధ్య రఘు (Comedian Raghu) ఇల్లు ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. మొత్తానికి రఘు (Comedian Raghu) హోమ్ టూర్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా పెద్ద చర్చకు దారి తీసింది.

Source: Suman TV

రఘు (Karumanchi Raghu) తన ఇంటిని అంత గొప్పగా నిర్మించుకోవడానికి కారణం ఏంటి? అతనేమైనా వందల కొద్దీ సినిమాలు చేశాడా? అంటే అదీ లేదు. జబర్దస్త్‌లో కూడా ఎంతో కాలం నిలదొక్కుకోలేకపోయాడు. పైగా వ్యసనాల కారణంగా చాలా సినిమాలు కోల్పోయాడనే టాక్. అలాంటి రఘు (Karumanchi Raghu) ఇంత గొప్పగా ఇంటిని ఎలా నిర్మించుకోగలిగాడు? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే అసలు విషయం ఏంటంటే..  రఘు (Comedian Raghu) కి తెలంగాణలో రెండు వైన్ షాపులు ఉన్నాయట. ఆ ద్వారా వచ్చిన డబ్బుతోనే కోట్లకు పడగలెత్తాడట . ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే ఇంత పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడని టాక్.

Sootiga Team

Recent Posts

‘Mr Bachchan’ has sizzling romance between lead pair

Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…

August 2, 2024

తెగ ట్రోలింగ్ అవుతోన్న కీర్తి

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…

August 2, 2024

Congress to move privilege motion against PM Modi

The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…

July 31, 2024

మెడ్ ప్లస్ వివాదంలో శివజ్యోతి

బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…

July 31, 2024

తొడలు చూపిస్తోన్న కాంతార సుందరి

"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…

July 31, 2024

అది ఫేక్ అంటున్న అన్నపూర్ణ

ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…

July 31, 2024